యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. గతంలో సోనియా కార్యదర్శిగా పని చేసిన సీనియర్ లీడర్ టామ్ వడక్కన్ గురువారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మన సాయుధ బలగాల సమగ్రతను కాంగ్రెస్ అనుమానించడం తనను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందని, అందుకే 20 ఏళ్లుగా ఉన్న ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు టామ్ వెల్లడించారు. బరువైన మనసుతో కాంగ్రెస్ పార్టీని వీడుతున్నాను. ఇది జాతి ప్రయోజనాలకు విరుద్ధం. ఎంతో బాధతో పార్టీకి వీడ్కోలు చెబుతున్నాను అని వడక్కన్ అన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఓ రాజకీయ పార్టీ వ్యవహరిస్తుంటే.. ఆ పార్టీని వీడటం తప్ప నాకు మరో మార్గం లేదు. ఇది సరి కాదు అని ఆయన స్పష్టం చేశారు