యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైఎస్సార్ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (68) ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. పులివెందులలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు. వివేకానంద రెడ్డి గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆయన మృతి వార్తతో కడప జిల్లా విషాదంలో మునిగిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ జగన్ ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.