YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఒకే గూటికి వంగవీటి, దేవినేని

 ఒకే గూటికి వంగవీటి, దేవినేని
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
బెజవాడ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దాలుగ వైరంగా ఉనన్ దేవినేని, వంగవీటి కుటుంబాలు, ఒకే పార్టీ గూటికి చేరాయి. కుటుంబాల మధ్య గొడవ, కులాల మధ్య గొడవగా మారి, ఎంత జరిగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఇప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో, చంద్రబాబు అధ్యక్షతన, నవ్యాంధ్రను ముందుకు తీసుకువెళ్ళటానికి ఏకం అయ్యారు.వైసీపీ అధినేత జగన్‌పై  రాధా విమర్శలు సంధించారు. రాజ్యాలున్నాయి పరిపాలిద్దామనే ఆరాటం వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డిదైతే, ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం పోరాటం టీడీపీదన్నారు. ఈ పోరాటంలో ఎవరికెవరికీ గిఫ్టులు కాదు.. మన ప్రజలకు మనమే గిఫ్టులు ఇచ్చుకుంటూ ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఎక్కడైనా సరే ఆ ఫ్యాన్‌ స్విచాఫ్‌ చేయాలనే నినాదంతో ముందుకెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెన్నుపోటులు గురించి జగన్‌ మాట్లాడుతుంటారని.. తమ్ముడు అంటూ తనకు వెన్నుపోటు పొడవలేదా అని ప్రశ్నించారు. విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే జగన్‌.. వారితో, వీరితో అందరితో కలుస్తూ ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. అంతకంటే వెన్నుపోటు ఉంటుందా అని నిలదీశారు. ఇప్పటికైనా జగన్‌ మారాలని సూచించారు.కాపులకు అండగా నిలిచింది టీడీపీనేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వారికి అత్యంత ప్రాధాన్యమిచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014లో చివరి విడతలో ఎన్నికలు పెట్టారని, ఈసారి కావాలనే తొలి విడతలో పెట్టి సమయం చాలా తక్కువ ఇచ్చారని, అయినా ఫర్వాలేదని, ఎలాంటి సంక్షోభాన్నైనా అవకాశంగా మార్చుకునే సత్తా తమకుందని పేర్కొన్నారు. 2004లో కాపులకు కార్పొరేషన్‌ పెడతామని చెప్పిన వైఎస్‌ కేవలం కమిటీని వేసి వదిలేశారని, తాను పాదయాత్రకు వెళ్లినప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశానని తెలిపారు. కాపుల కోసం తాను అసెంబ్లీలో తీర్మానం చేసి దిల్లీకి పంపిస్తే జగన్‌ అసలు అసెంబ్లీకే రాలేదని గుర్తు చేశారు. కేంద్రం పేదలకు ఇచ్చిన 10 శాతంలో తాను కాపులకు 5 శాతం రిజర్వేషన్‌ కల్పించానని వెల్లడించారు. 

Related Posts