YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబు సామాజిక వర్గానికే పెద్ద పీట 126 లో 72 వారికే

 బాబు సామాజిక వర్గానికే పెద్ద పీట 126 లో 72 వారికే
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
తాము అన్ని కులాలకు సమాన ప్రాధాన్యత ఇస్తాం. అన్ని మతాలను గౌరవిస్తాం, సామాజిక న్యాయం మా పార్టీ వల్లే సాధ్యం ఇది ఎన్నికల ముందు ప్రతి పార్టీలు చెప్పే నీటిమూటలు వంటి హామీలు. కానీ వాస్తవరూపంలోకి వచ్చేటప్పటికి ఈ వాగ్దానాలన్నీ గాల్లో కలిసి పోతాయి. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జారీ చేసిన తొలి జాబితా పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లం అయ్యింది. ఆయన ప్రకటించిన 126 మంది అభ్యర్థుల జాబితాలో తమ కులానికి పెద్ద పీట వేసుకుని గెలుపు గుర్రాలనే అందమైన పేరు తగిలించి సామాజిక న్యాయం చేసేసింది ఆ పార్టీ అన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి పెరిగిపోయాయి.వాస్తవానికి రాష్ట్రంలో వున్న కమ్మ సామాజిక వర్గం జనాభా నిష్పత్తికి ఇచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లకు అస్సలు పొంతనే ఉండదు. ఈసారి అదే జరిగింది. బిసి ల పార్టీ గా తమకు తాము ప్రకటించుకునే టిడిపి 72 స్థానాలు కమ్మ సామాజికవర్గం వారికి సీట్లు కేటాయిస్తే మరో అతి తక్కువ జనాభా నిష్పత్తి వుండే రెడ్డి సామాజిక వర్గానికి 20 అసెంబ్లీ స్థానాలను సగం జనాభా వుండే బిసి సామాజిక వర్గానికి 31 సీట్లను కాపులతో సహా కేటాయించి అందరికి షాక్ ఇచ్చారు టిడిపి అధినేత. ఎస్సి సామాజిక వర్గానికి 17, ఎస్టీ సామాజిక వర్గానికి 2 స్థానాలు టిడిపి తొలి జాబితాలో స్థానం దక్కింది. వాస్తవానికి ఎస్సి ఎస్టీ నియోజకవర్గాలు రిజర్వేషన్ ముందే ఉండటంతో అన్ని పార్టీలు ఇచ్చే స్థానాలే టిడిపి ఇచ్చింది. జనరల్ స్థానంలో సామాజికంగా బాగా వెనుకబడిన వర్గాలకు పోటీ అవకాశమే లేకుండా పోయింది.డబ్బు, పలుకుబడి, కులం ప్రాతిపదికనే అన్ని పార్టీల టికెట్లు కేటాయిస్తూ వస్తున్నాయి. టిడిపి కూడా ఇదే ఫార్ములా అనుసరించింది. దాంతో సామాజిక న్యాయం అనేది అందని ద్రాక్షగానే కనిపిస్తుంది. ప్రతిభ కొలమానంగా మాత్రం టికెట్లు దక్కించుకున్న వారిని వేళ్ళపై సులభంగా లెక్కించవచ్చు. అధికార పార్టీ టికెట్ల పండుగ మొదలు పెట్టిన నేపథ్యంలో ఇక విపక్షం వైసిపి, పవన్ జనసేన టికెట్ల కేటాయింపు ఎలా చేస్తారనే ఆసక్తి నెలకొని వున్నా టిడిపి కి భిన్నంగా ఏమి వుండబోదన్నది విశ్లేషకుల అంచనా.

Related Posts