YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ పది రాష్ట్రాలపైనే కమలం గురి...

ఆ పది రాష్ట్రాలపైనే కమలం గురి...
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 
కమలం పార్టీ ఆశలు నెరవేరేనా…. ? సర్టికల్ స్ట్రయిక్స్ తర్వాత ప్రధాని నరేంద్రమోదీ ఇమేజ్ అమాంతంగా పెరగడం తమకు కలసి వస్తుందని కమలం పార్టీ భావిస్తుందా? సర్వేలు కూడా ఇదే చెబుతుండటం ఆ పార్టీకి కొత్త ఆశలు పుట్టుకొస్తున్నాయి. గత ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ స్థానాలను సొంతంగా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో కమల నాధులు ఉన్నారు. ఇందుకోసం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. పార్లమెంటు సభ్యుల ఎంపికలో కూడా కేంద్ర నాయకత్వం ఆచితూచి వ్యవహరిస్తుంది.కొన్ని రాష్ట్రాల్లో సిట్టింగ్ ఎంపీలకు కూడా టిక్కట్లు ఇవ్వబోమని సంకేతాలను పంపింది. మ్యాజిక్ ఫిగర్ కు తగినన్న సీట్లు సొంతంగా తెచ్చుకోవాలన్న పంతంతో మోదీ, అమిత్ షాలు ఉన్నారు. గత ఐదేళ్లలో పార్లమెంటు సభ్యులు కనపరిచిన తీరు, ప్రజల్లో వారికున్న ఆదరణ అంచనా వేసుకుని మరీ టిక్కట్లను కేటాయించనున్నారు. ఎంపీ టిక్కెట్ల కేటయింపు కేవలం రాష్ట్ర పార్టీ నేతలపై ఆధారపడకుండా ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు, మూడు అభ్యర్థుల పేర్లను అమిత్ షా స్వయంగా పరిశీలిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికపైన సర్వేలు చేయించే పనిలో ఉన్నారు.గత ఎన్నికలలో పది రాష్ట్రాల్లో కమలం పార్టీ తిరుగులేని విజయం సాధించింది. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రంలో సాలిడ్ స్థానాలను చేజిక్కించుకుంది. గత ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను 71 స్థానాలను దక్కించుకున్న బీజేపీకి కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుండటం కొంత కలసి వస్తున్నట్లే కన్పిస్తోంది. ఇక బీహార్ లోనూ జేడీయూతో పొత్తుతో గతంలో సాధించిన సీట్లలో కొన్ని త్యాగాలు చేయాల్సి వచ్చినా నితీష్ కలయిక తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని ఆశపడుతున్నారు. ఇక గుజరాత్ లో తమకు ఎదురే లేదన్న ధీమాతో ఉన్నారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలోనూ పూర్వ వైభవం కోసం కమలం పార్టీ పరితపిస్తుంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ దండును నియోజకవర్గాల వారీగా దించేశారు. అమిత్ షా, మోదీల పర్యటనలు కూడా ఇక్కడ ఎక్కువగా ఉండేట్లు ప్లాన్ చేశారు. ఇక ప్రతి పార్లమెంటు సీటు ప్రతిష్టాత్మకం కావడంతో రాజ్యసభ్య సభ్యులుగా ఉండి కేంద్రమంత్రులుగా ఎంపిక చేసిన వారిని కూడా బరిలోకి దించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. మొత్తం మీద ఎవరిమీద ఆధారపడకుండా సొంతంగానే అధికారంలోకి రావాలన్న కమలం కల నెరవేరుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Related Posts