YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పదేళ్ల తర్వాత కమలం ఒంటరి పోరు

పదేళ్ల తర్వాత కమలం ఒంటరి పోరు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

పదేళ్ల తర్వాత బీజేపీ తెలంగాణలో ఒంటరిపోరుకు బీజేపీ సిద్దమైంది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో  ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ.. వచ్చే నెల జరిగే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఒంటరిగా రంగంలోకి దిగనుంది. జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు ఒక్కో స్థానంలో ముగ్గురు అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను గత నెలలోనే రాష్ట్ర శాఖ ప్రారంభించింది.మోదీ ఛరిస్మాతో ఇతర పార్టీల నుంచి ప్రముఖులు వస్తారని ఎదురు చూసినా.. అలాంటి వారు ఎవరూ వచ్చే దాఖాలాలు కన్పించడం లేదు. గతేడాదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి చెంది.. నాలుగు సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ వైపునకు రావడానికి ఎవరూ సాహసించడం లేదన్న ప్రచారం జరుగుతోంది.అయితే కొందరు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అధికారులు, పలువురు పారిశ్రామిక వేత్తలు టికెట్ ఇస్తే పార్టీలో చేరుతామంటూ రాయబారాలు నడుపుతున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అలాంటి వారు చేరితే.. పెద్దపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, జహిరాబాద్,ఆదిలాబాద్ జిల్లాల్లో కొత్తవారికి టికెట్లు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.అభ్యర్థులతో ప్రతిపాదిత జాబితాను సిద్ధం చేసుకొని పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఢిల్లీకి వెళ్లి.. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితాను అందజేస్తారు. జాబితాను పరిశీలించిన అనంతరం ఢిల్లీలోనే అభ్యర్థులను ప్రకటిస్తారు. కాగా సికింద్రాబాద్ లోక్‌సభ సీటుకు డిమాండ్ ఉంది.ఈ స్థానంలో మళ్లీ పోటీ చేస్తానని ప్రస్తుత ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రకటించారు. అమిత్ షా ఆదేశిస్తే.. పోటీ చేస్తానని పార్టీ అధ్యక్షుడు కే లక్ష్మణ్ ప్రకటించారు. తాజాగా జీ కిషన్‌రెడ్డి కూడా కచ్చితంగా పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే కిషన్‌రెడ్డి  సొంత నియోజకవర్గం చేవెళ్ల కాబట్టి.. అక్కడ పోటీ చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.అయితే.. కిషన్‌రెడ్డి మాత్రం సికింద్రాబాద్‌పైనే దృష్టి సారించారు. ప్రతిపాదిత జాబితాలో ఉన్నవారు కాకుండా.. చివరి నిమిషంలో కొత్తవారికి కూడా టికెట్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. గుర్తించిన అభ్యర్థులు పేర్లు ఇవి. సికింద్రాబాద్: బండారు దత్తాత్రేయ, కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డిహైదరాబాద్: సతీష్ అగర్వాల్, డాక్టర్ నజీమ్, మల్కాజ్‌గిరి: ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, కొంపెల్లి మోహన్‌రెడ్డి, ఎన్ రాంచందర్‌రావు (ఎమ్మెల్సీ), చేవెళ్ల: బీ జనార్దనరెడ్డి, నందకుమార్, అంజన్ కుమార్ యాదవ్, నల్లగొండ: గారపాటి జితేందర్‌రెడ్డి, గోలి మధుసూదన్‌రెడ్డి, మరో పారిశ్రామిక వేత్త, భువనగరి: పీవీ శ్యాంసుందర్‌రావు, ఖమ్మం: విజయ్ కుమార్, వరంగల్:  వేముల అశోక్,  జైపాల్(మాజీ ఎమ్మెల్యే) మహబూబాబాద్:  సీతయ్య పెద్దపల్లి:  ఎస్ కుమార్, మరో వ్యక్తి, కరీంనగర్:  బండి సంజయ్, రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమర్, మహబూబ్‌నగర్:  శాంతకుమార్, కీర్తిరెడ్డి, మెదక్: ఆకుల రాజయ్య, రఘునందన్‌రావు , నాగర్ కర్నూల్:  బంగారు శృతి,నిజామాబాద్:  సదానందరెడ్డి, ధర్మపురి అర్వింద్
జహిరాబాద్:   సంజీవరెడ్డి, వెంకటరమణారెడ్డి, లక్ష్మారెడ్డిఆదిలాబాద్:  ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆరుగురు పోటీ పడుతున్నారు. 

Related Posts