యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తెదేపాకు రెండు కళ్లు అని స్థానిక ఎమ్మెల్యే బి వి జయ నాగేశ్వర రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ఇంటింటి ప్రచారం లో భాగంగా శుక్రవారం ఉదయం పట్టణంలోని తేరు బజారు లో ఎమ్మెల్యే బి.వి పర్యటించారు. ఈ సందర్భంగా బి వి జయ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పథకాలే పార్టీ విజయానికి శ్రీ రామ రక్ష అన్నారు. శాశ్వత తాగునీటి వసతి కల్పించాలని లక్ష్యంతో కొత్తగా తాగునీటి పథకం మంజూరు చేయించినట్లు వివరించారు. ఎమ్మిగనూరు పట్టణాన్ని అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామన్నారు. రాబోయే రోజుల్లో చేనేత క్లస్టర్లు మంజూరు చేస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో సార్వత్రిక ఎన్నికల్లో రెండవసారి ఎమ్మిగనూరు ప్రజలకు సేవచేసే భాగ్యం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సంక్షేమ, అభివృద్ధిని రెండు కళ్లుగా తీసుకుపోతూ చేసిన పనిని, చేయాల్సిన పనుల్ని తెలియజేసి మళ్లీ ఎమ్మిగనూరులో తెదేపా పార్టీ జెండా రెపరెపలాడే విధంగా జిల్లాలో మొదటి సీటు చంద్రబాబు నాయుడు కి కనుక ఇస్తూ ముందుకు పోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.