Highlights
- డ్యాన్స్ చేయలేదని తీవ్రంగా కొట్టిన డ్యాన్స్ టీచర్
- ఐసీయూలో చికిత్స పొందుతున్న విద్యార్థి
.విధ్యార్థులకు మాటలతో చెప్పి నేర్పించాల్సిన గురువులే విచక్షణారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన సృజన స్కూల్‌లో ఈ అమానుష చర్య బయట పడింది. డ్యాన్స్ సరిగా చేయడం లేదని ఒకటో తరగతి విద్యార్థి రాహుల్‌ను డ్యాన్స్ మాస్టర్ తీవ్రంగా కొట్టాడు. దీంతో చిన్నారి రాహుల్ చేయి విరిగింది. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు స్కూల్‌కు చేరుకుని రాహుల్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారికి ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా డ్యాన్స్ మాస్టర్ తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతన్ని అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత నెలలో సరూర్‌నగర్‌లోని శ్రీచైతన్య స్కూల్‌లో బాలిక సరిగా డ్యాన్స్ చేయలేదని డ్యాన్స్ మాస్టర్ చితకబాదిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకూ స్కూల్ యాజమాన్యం మాస్టర్‌పై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు.