యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం ఖగ్గల్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయం టిడిపి అభ్యర్థి తిక్కా రెడ్డి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేసి ప్రచారం ప్రారంభించారు. తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇంతలోనే వైకాపా నేత ప్రదీప్ రెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి భార్య వచ్చి టిడిపి జెండా ను తొలగించారు. తిక్కారెడ్డితో వాగ్వాదానికి దిగారు. తరువాత అయన పై దాడి చేశారు. మరికొంతమంది వేటకొడవళ్లు తీసుకువచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తిక్కా రెడ్డి గన్ మెన్ గాల్లో నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తిక్కా రెడ్డి, కి మాధవరం ఏఎస్ఐ వేణుగోపాల్ కాళ్లకు బుల్లెట్ తగలడం తో కింద పడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పోలీసులు తిక్కా రెడ్డి ని వాహనం చికిత్స కోసం తరలించారు. ఓటమి భయంతో వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అనుచరులు హత్యాయత్నానికి పాల్పడ్డారని తిక్కారెడ్డి అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.