యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖ లో మళ్లీ తూపాకులు గర్జించాయి జిల్లాలోని పెదబయలు మండలం పెద్దకోడాపల్లి సమీపంలో శుక్రవారం ఆర్ధరాత్రి ప్రాంతలో మావోలు, పోలీసులకు తారసపడ్డారు. బురద మామిడి వద్ద మావోయిస్టులకు, పోలీసులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు మావోయిస్టుల ఘటనాస్థలిలోనే చనిపోగా.. మరికొందరు పరారయ్యారు. అయితే, చనిపోయిన వారు గిరిజనులని స్థానికులు అంటున్నారు. గ్రామం సమీపంలో నాటుతుపాకితో వేటకు వెళ్లిన ఇద్దరు గిరిజనులు భూషణం, జమాన్ దొర లను పోలీసులు హతమార్చారని వారంటున్నారు. తెల్లవారుజామున నాటుతుపాకితో పిల్లుల వేటకు వెళ్లిన వారిద్దరిని కుంబింగ్ చేస్తున్న పోలీసులు కాల్చి చంపారని మృతుల బంధువులు మండిపడుతున్నారు.