యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ శనివారం ఉదయం వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్లో అయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వివేకాను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతిమ కార్యక్రమాలను జరిపించారు. భారీ భద్రత మధ్య అంతిమయాత్రలో జగన్ నడిచారు.