YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

బాబు మాటలు వింటే ఊసరవెళ్లికి కూడా భయమే

Highlights

  •  నాలుగేళ్ల  పాలనలో మోసాలు, అబద్ధాలు, అధికార దుర్వినియోగం
  • చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు
  • వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాం 
  •  కనిగిరి సభలో వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ 
బాబు మాటలు వింటే ఊసరవెళ్లికి కూడా భయమే


వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, చంద్రబాబు మాట మార్చే తీరుకు, ఆయన స్పీడ్‌కు ఊసరవెళ్లి కూడా భయపడుతుందని విమర్శించారు. మనందరి ప్రభుత్వం వచ్చాక చదువుల విప్లవం తెస్తానని, ప్రతి పేదవాడికి అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు.
 నడిరోడ్డుపై నిలబడాల్సిన అవసరం ఏ ఒక్కరికి లేదు..
ఎండాకాలం మొదలైంది. ఎండలు కూడా తీక్షణంగా ఉన్నాయి. ఇవేవి ఖాతరు చేయకుండా పొద్దునుంచి వేలాది మంది అడుగులో అడుగులు వేశారు. ఒకవైపు అర్జీలు ఇస్తూ కష్టాలు చెబుతూ..మరోవైపున అన్నా..మేమంతా నీకు తోడుగా ఉన్నామని చెబుతున్నారు. ఈ నడిరోడ్డుపై ఎండలో నిలవాల్సిన అవసరం ఏ ఒ క్కరికి లేదు. అయినా కూడా ఎండను ఖాతరు చేయకుండా, నడిరోడ్డు అన్న సంగతి లెక్క చేయకుండా చిక్కని చిరునవ్వుతో ఆప్యాయతలు చూపుతున్నారు. ఆత్మీయతలు పంచుతున్నారు. మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే..రోజుకో మాట..పూటకో మాట మారుస్తుంటే, ఆయన మాటలు ఆ పేపర్లు, టీవీల్లో చూస్తుంటే ఊసరవెళ్లి కూడా భయపడే విధంగా ఉంది. ఇదే చంద్రబాబు రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు ఏం చేస్తున్నారో నాలుగేళ్లుగా మీరు చూశారు. దేశంలో ఎక్కడ లేని అవినీతి ఇక్కడే చూశాం. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మీలో ఏ ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? మోసాలు, అబద్దాలు, విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం. ఇదే పెద్ద మనిషి ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఇదే పెద్ద మనిషి మద్యం గురించి ఏమన్నారు. పిల్లలు మద్యం తాగి చెడిపోతున్నారు. అధికారంలోకి రాగానే మద్యాన్ని తీసేస్తాం. బెల్టు షాపులు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఇవాళ గ్రామాల్లో మంచినీళ్లు దోరుకుతారో లేదో తెలియదు కానీ, మద్యం లేని గ్రామం లేదు. చంద్రబాబు హైటెక్‌ పాలనలో మద్యం కావాలంటే ఫోన్‌ కొడితే హోం డెలివరీ చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని, కరెంటు బిల్లులు తగ్గిస్తానని చెప్పిన పెద్ద మనిషి నాలుగేళ్లలో మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు. గతంలో కరెంటు బిల్లులు రూ.50, 100 వచ్చేది. ఇప్పుడు రూ.500, 700, 1000 చొప్పున బిల్లులు వస్తున్నాయి. ఇష్టారాజ్యంగా పెనాల్టీలు వేస్తున్నారు. 
చంద్రబాబు పాలనలో మూడుసార్లు చార్జీలు గతంలో రేషన్‌షాపుల్లో బియ్యం, కందిపప్పు, చెక్కర, పామాయిల్, చింతపండు, గోదుమలు వంటి 9 రకాల సరుకులు దొరికేవి. చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. వేలిముద్రలు పడటం లేదని కోతలు విధిస్తున్నారు ఏ రైతుకు ఇవాళ గిట్టుబాటు ధర లేదు. ఈ ప్రాంతంలో శనగ ఎక్కువగా వేస్తున్నారు. ఉత్పత్తి ఖర్చు రూ.5 వేలు ఉంది. అయితే క్వింటాల్‌ రూ. 3 వేలకు కొనుగోలు చేయడం లేదు. మినుములు, కందులకు కనీస మద్దతు ధర లేదు. పొగాకు కేంద్రాల వద్దకు వెళ్లి నాలుగేళ్లుగా వైయస్‌ జగన్‌ ధర్నాలు చేస్తునే ఉన్నారు.  ఇవాళ పొగాకు వేయలేక, గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు.  ఒక్కసారి దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తుకు తెచ్చుకొండన్నారు.
ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు. వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా, బేషరత్తుగా మాఫీ కావాలంటే బాబు సీఎం కావాలన్నారు. నాలుగేళ్లలో బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా? 
ఎన్నికల సమయంలో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. ఆడవాళ్లు కన్నీరు పెడితే ఇంటికి అరిష్టం అంటారు. ఇవాళ ఆడవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా కన్నీరు పెడుతున్నారు. నాలుగేళ్లలో ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. చిన్న పిల్లలను వదిలిపెట్టలేదు.  ఎప్పుడైన చంద్రబాబు దారిలో కనిపిస్తే రూ.90 వేల పరిస్థితి ఏంటని ప్రశ్నించండి. ఐదు రోజుల నుంచి కాంట్రాక్ట్‌ విద్యుత్‌కార్మికులు నిరాహారదీక్షలు చేస్తున్నారు. పట్టించుకునే నాథుడు లేడన్నారు.

Related Posts