యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్రం బెదిరింపులకు భయపడమని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం తిరుపతిలోని తారకరామ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు మాట్లాడుతూ బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, విభజన హామీలు అమలు చేయలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్ర సమస్యలపై 29సార్లు ఢిల్లీ వెళ్లి పదేపదే చెప్పాం. అయినా వినలేదన్నారు. నమ్మకద్రోహం చేశారనే బీజేపీపై తిరుగుబాటు చేశామన్నారు. 18 హామీలిచ్చి ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రం కోసం తిరుగుబాటు చేస్తే మనపైనే దాడులు చేస్తున్నారన్నారు.
తెలంగాణ నుంచి మనకు రావాల్సిన రూ.5వేల కోట్లు ఇవ్వమంటే మనపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ బెదిరింపులకు ఎవరూ భయపడరన్నారు. గెలుపు గుర్రాలను రంగంలోకి దింపామని తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. టీడీపీ తొలి జాబితా పట్ల 90శాతం మంది కార్యకర్తలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ఆలోచనతో ఉండాలన్నారు. అభ్యర్థుల ఎంపిక చాలా పకడ్బందీగా చేస్తున్నామన్నారు. కార్యకర్తలు నాకు ప్రాణ సమానమని.. నా కుటుంబ సభ్యుల కన్నా మిన్న అని అయన అన్నారు. పార్టీ జెండా మోసిన కార్యకర్తలందరికీ గుర్తింపు ఉంటుందన్నారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే అధికారంలోకి వచ్చామన్నారు. ప్రపంచ స్థాయిలో నాకు గుర్తింపు రావడానికి కార్యకర్తలే కారణమన్నారు. వైసీపీకి ఓటేస్తే అవినీతి పార్టీకి ఓటేసినట్టవుతుందని మోడీ అన్నారన్నారు.
వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చిన మోడీ ఏపీకి ద్రోహం చేశారన్నారు.