Highlights
- నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు దిగివస్తాయి
- విశాఖ భాగస్వామ్య సదస్సులో ఉప రాష్ట్రపతి
- ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానం : చంద్రబాబు
జీఎస్టీని కేవలం కేంద్రం, ఒక పార్టీ నిర్ణయించలేదని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు పలుమార్లు సమావేశమై ఏకగ్రీవ అంగీకారానికి వచ్చాయని పేర్కొన్నారు. శనివారం విశాఖపట్నంలో అయన సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రరామ్భించారు. ఈ సందర్బంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. జీఎస్టీ అమలుకు దాదాపు 21 భేటీలు నిర్వహించారని గుర్తు చేశారు. నోట్ల రద్దు ప్రధాని చేపట్టిన అతి పెద్ద ఆర్థిక సంస్కరణ అని అన్నారు. దాచి ఉంచిన నల్లధనాన్ని బ్యాంకులకు చేర్చడమే నోట్ల రద్దు ఉద్దేశమన్నారు. నోట్ల రద్దు వల్ల బ్యాంకుల వడ్డీరేట్లు దిగివస్తాయని తెలిపారు. దేశంలో ఆర్థిక వృద్ధి శరవేగంగా పెరుగుతోందని ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, అంతర్జాతీయ సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానమని అన్నారు. రాష్ట్రంలో మూడోసారి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. గతేడాది కంటే ఈ సారి సదస్సుకు స్పందన బాగుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు . ఏపీ పెట్టుబడులకు విశాఖ భాగస్వామ్య సదస్సు ను గమ్యస్థానంగా పేర్కొంటూ.. ఏపీకి 13 లక్షల 54 వేల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.