యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైయస్ వివేకానంద రెడ్డి హత్యపై గాంధీ విగ్రహం వద్ద నల్లబ్యాడ్జీలతో వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.మాజీ ఎంపీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య మరియు టీడీపి ప్రభుత్వ హయాంలో జరిగిన హత్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నల్ల బ్యాడ్జీలతో పత్తికొండలో గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు.వివేకానంద రెడ్డి కొరకు వైయస్ఆర్సీపీ నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంలో హత్యా రాజకీయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి అని అన్నారు.వచ్చే ఎన్నికలలో గెలవలేక బలమైన అభ్యర్థులపై హత్యా రాజకీయాలను పూనుకుంటున్నారని తెలియజేశారు.వచ్చే ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీరంగడు,రామచంద్ర మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.