YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు

 జగన్ శవరాజకీయాలు చేస్తున్నారు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ అధినేత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చింతమనేని ప్రభాకర్ మండిపడ్డారు. ఏదో కారణంతో జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి చనిపోతే, ఆ వివాదంలోకి చంద్రబాబును, టీడీపీ నేతలను లాగేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా సున్నంపాడు, తెల్లదేవరపాడు గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం ఎన్నికల ప్రచారం పాల్గొని ప్రసంగించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు గ్రామాల ప్రజలు దేవినేని ఉమకు ఘనస్వాగతo పలికి మా ఊరు దేవుడు వచ్చాడంటూ మహిళలు ప్రత్యేకంగా హారతులతో స్వాగతించారు. ఆ తర్వాత ఊరులోని ఇంటింటికి వెళ్తూ అందరిని ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు దేవినేని ఉమ. వెళ్లిన ప్రతి గడపలో హారతులతో, కుంకుమ దిద్దుతూ మహిళలు స్వాగతిస్తున్నారు. ఈ సందర్భగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ.. ‘మండుటెండలు సైతం లెక్కచేయకుండా ప్రజలు నాతో ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న మైలవరంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారంటే.. అది కేవలం ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసే’ అని తెలిపారు. 
అలాగే ఇంకా ఆయన మాట్లాడుతూ..  వివేకానందరెడ్డి జగన్ కి సొంత బాబాయి. అలాంటి ఆయనపై వాళ్ళ ఛానల్ లోనే మొదట గుండె పోటు అని చూపించారు. ఆ మనిషిని చూసిన వారు ఎవరైనా గుండె పోటు అంటే నమ్ముతారా? జరిగిన సంఘటనని ఎందుకు దాయాల్సి వచ్చింది? అంత రక్తం కారితే సాక్షి ఛానల్ కి పత్రికకు ఎందుకు కనపడలేదు? ఇలాంటి వారికి రాజ్యాధికారం కావాలని అడుగుతున్నారు. ఈ రోజు జగన్ సొంత మనుషులకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ ఆయన ప్రశ్నించారు. 
అదేవిధంగా ఈ రోజు ఈ నియోజకవర్గానికి ఒక నేత వచ్చాడు. ఆయన మొన్నటివరకు హైద్రాబాద్ లో వ్యాపారాలు చేశాడు. వీళ్ళు హైద్రాబాద్ లో వ్యాపారం చేస్తే వాళ్ళు ఎవరి చేతుల్లో పని చేస్తారో అందరికీ తెలుసని.. తాను 21వ తేదీన నామినేషన్ వేస్తానని ప్రకటించిన తర్వాత వాళ్ళు కూడా అదే రోజు నామినేషన్ వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఉమ తెలిపారు. దీన్నిబట్టి మనం ఇక్కడ కట్టుకోవాలి అని, గొడవలు ద్వారా రాజకీయ లబ్ది పొందాలని వారు చూస్తున్నారని.. ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించి.. గొడవలకు దూరంగా ఉండాలని ఆయన కోరారు. అలాగే తన నామినేషన్ రోజు మీరు అంతా తప్పకుండా వచ్చి తనను ఆశీర్వదించాలని దేవినేని ఉమ కోరారు. 
అదేవిధంగా మా నాయకులు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి అవి నెరవేర్చే భాద్యత తాను తీసుకుంటానని ప్రజలకు స్పష్టం చేశారు. ఇక ‘మూడోసారి కూడా నన్ను ఆశీర్వదించి మీ ఓటుతో నన్ను గెలిపించండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. 
అలాగే.. ఒక దళిత మైనర్ బాలికను అతి కిరాతకంగా చంపిన చరిత్ర ఈ నియోజకర్గంలో పోటీ చేస్తున్న వైసీపీ నాయకుడిది అని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు పోటీ నీతికి, అవినీతికి మధ్య జరుగుతుందని..కాబట్టి ప్రజలు అందరు నీతి వైపు నిలిచి నన్ను గెలిపించండని ఆయన కోరారు. వైసీపీ అధినేత జగన్ మొదటి ముద్దాయి అయితే కృష్ణ ప్రసాద్ ఏడవ ముద్దాయి అంటూ ఉమ వివరించారు. ఏప్రిల్ 11న ఇక్కడి ప్రజలంతా సైకిల్ గుర్తుకి ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను, ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానీని భారీ మెజారిటీతో గెలిపించాలని దేవినేని ఉమ ప్రజలను కోరారు. 
మైలవరం నియోజకవర్గంలోని సున్నంపాడు పంచాయతీలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో గత ఐదేళ్లలో 37లక్షలు విలువైన మొత్తం 09 పనులు చేపట్టామని మంత్రి దేవినేని ఉమ తెలిపారు. అలాగే.. సున్నంపాడులో 16లక్షల రూపాయల విలువైన 5 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. 17 లక్షల రూపాయల విలువైన 03 పనులు చివరి దశలో ఉన్నాయని.. 4లక్షల విలువైన 01 పని ప్రారంభించాల్సి ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగీ 247 మంది రైతులకు రైతు రుణ మాఫీ అందించిన ఘనత మాదేనని.. మొత్తం 29.08లక్షలు రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామని అన్నారు. పంట రుణాల ద్వారా 190 మందికి గ్రామంలో 57లక్షలు ఆర్థిక లబ్ది చేకూరిందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ ద్వారా 08 మందికి 1.44 లక్షల విలువైన యంత్రాలు అందించామని వివరించారు. 
అదేవిధంగా రైతుమిత్ర గ్రూపులకు
ఇచ్చిన ఆర్ధిక సహాయం కింద 20 మంది రైతులు 4లక్షలు అందించామని.. ఇంటింటికీ కుళాయి ఏర్పాటు కోసం 15లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. సున్నంపాడు పరిధిలో 4.90లక్షల విలువైన ఒక RWS పనిని పూర్తి చేశామని.. వెలుగు డీఆర్ డీఏ ప్రాజెక్టు కింద 132 సంఘాలకు 2.33 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలు మంజూరు చేశామని ఉమ వెల్లడించారు. అంతేకాకుండా బ్యాంకు లింకేజి ద్వారా 25 సంఘాలకు 91.25 కోట్ల రూపాయలు అందించామని..స్త్రీ శిశు సంక్షేమ శాఖకి 5.6 లక్షల మంజూరు చేశామని తెలిపారు. ఉపాధి హామీ పధకం కింద 39.56 లక్షల రూపాయల పనులు చేపట్టామని తెలిపిన ఆయన స్మశాన వాటికకు 5.53లక్షలు మంజూరుచేసామన్నారు. 4 కంపోస్ట్ పిట్లు, 7 లక్షల విలువ గల41 పంట సంజీవనులు, సాలిడ్ వెల్త్ ప్రాసెస్ సెంటర్ అభివృద్ధి చేశామని తెలిపారు. 93 మందికి పింఛన్ల రూపంలో 1.90 లక్షలు అందిస్తున్నామని స్పష్టం చేసిన దేవినేని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 16 మందికి 3.76లక్షల సాయం అందించామని అన్నారు. దుల్హన్ పధకం ద్యారా ముగ్గురు లబ్ది పొందారని.. 61లక్షల రూపాయల విలువైన మొత్తం 34 గృహాలను నిర్మించి ఇచ్చామని ఉమ వివరించారు. కాగా సున్నంపాడులో 46 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి 6.9 లక్షలు మంజూరు చేశామని.. మొత్తం 22మందికి 17.85లక్షల ప్రభుత్వ సంక్షేమ రుణాలను కూడా మంజూరు చేసినట్లు దేవినేని ఉమ వివరించారు. ఎన్నడూ ఏపార్టీ చేయని విధంగా ఒక్క ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ ఊరుకి అధిక మొత్తంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు వాటి ఫలాలను ప్రజలకు అందించామని దేవినేని ఉమ వివరించారు.

Related Posts