యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అపరాల సాగుపై వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలి. సబ్సిడిపై అపరాల విత్తనాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీ పునేటా అధికారులకు సూచించారు. సోమవారం అయన ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కలెక్టర్లు,వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. ఆరు జిల్లాలలో 50వేల హెక్టార్లలో అపరాల సేద్యం చేస్తున్నారు. మినుము 20,200హెక్టార్లు, పెసలు 29,800హెక్టార్ల సాగు లక్ష్యం గా పెట్టుకోవాలి. వేసవిలో పత్తి సేద్యాన్ని నియంత్రించాలి. ముందస్తు పత్తిసాగు వల్ల ఖరీఫ్ లో పత్తిపై గులాబి పురుగు బెడద నివారించాలి. పశువులకు తాగునీటి కొరత నివారించాలి. పశువులకు తాగునీటి తొట్టెలు ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు తొట్టెలను నీటితో నింపాలని అన్నారు. ఇంకా పనులు చేపట్టని 2వేల గ్రామాల్లో వెంటనే ప్రారంభించాలి. నరేగా కింద కూలీలకు ఉపాధి కల్పించాలి. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా మెరుగుపరచాలి. సాగర్ డెల్టా, కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేయాలి. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. ఎన్నికల్లో ఎక్కడా ఉద్రిక్తతలు లేకుండా చూడాలి. పోలీసు, రెవిన్యూ అధికారులు సమన్వయంగా పనిచేయాలి. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు దోహదపడాలని అయన అన్నారు.