YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాయవతికి కాంగ్రెస్ చెక్

 మాయవతికి కాంగ్రెస్ చెక్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

మొన్నటి వరకూ మిత్రులుగా ఉన్నవారు క్రమంగా శత్రుత్వం పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తాడో పేడో తేల్చుకుందామని సిద్ధమవుతున్నట్లే కన్పిస్తుంది. వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకపోయినా మిత్రుల అండదండలతో గద్దెనెక్కుదామనుకోవడం ఒక ఆలోచన. ఎన్నికల అనంతరం పొత్తు గురించి ఆలోచిస్తారు కానీ కాంగ్రెస్ మాత్రం ఎన్నికల తర్వాత కూడా తమతో కలిసి రాకపోయినా పరవాలేదన్న నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే తమ పట్ల కొంత సానుకూలంగా ఉన్న వారిని సయితం ప్రతికూలంగా మార్చుకుంటోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఉత్తరప్రదేశ్ లో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు కలసి పొత్తు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను దూరం పెట్టేశారు. అమేధి, రాయబరేలీలో మాత్రం తాము పోటీ పెట్టబోమని స్పష‌్టం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది. మాయావతి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ తో ఏ రాష్ట్రంలోనూ పొత్తు ఉండదని సంచలన ప్రకటన చేశారు. అయితే దీనికి కాంగ్రెస్ గట్టిగానే జవాబివ్వాలనుకుంటోంది. మాయావతికి బలమున్న ప్రాంతంలోనే తమ దెబ్బ రుచి చూపాలనుకుంటోంది.ఉత్తరప్రదేశ్ లోని 80 లోక్ స్థానాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలను ఇన్ ఛార్జులగా రాహుల్ గాంధీ నియమించారు. తాము కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి రప్పించుకునే ప్రయత్నంలో ఇద్దరు నేతలు కష్టపడుతున్నారు. తాజాగా బీఎస్పీ, ఎస్పీ ఓట్ల చీలికే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుండటం కొంత మాయావతిలో ఆందోళనకు గురి చేస్తోంది. మాయావతికి పట్టున్న దళిత వర్గంలో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది.మాయావతి దళిత నేతగా అందరికీ సుపరిచితమే. అయితే ఆమె తర్వాత యూపీలో దళితులకు అండగా ఉంటున్న భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ తో ప్రియాంక గాంధీ సమావేశం కావడం చర్చనీయాంశమైంది. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రియాంక కోరినట్లు తెలిసింది. మాయావతి వ్యవహారం మోదీకి అనుకూలంగా ఉందన్న అనుమానాలు ఆమె వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు బద్ధ విరోధిగా ఉన్న ఆయన బాబాయి శివపాల్ యాదవ్ తో కూడా కాంగ్రెస్ టచ్ లో ఉంది. ఆయన పార్టీ ప్రగతి శీల్ సమాజ్ వాదీ తో కలసి పోటీ చేయాలని భావిస్తోంది. శివపాల్ యాదవ్ పార్టీకి ఆయనకు పట్టున్న ప్రాంతంలో పది సీట్ల వరకూ ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మొత్తం మీద ఎన్నికల తర్వాత మిత్రులుగా మారే వారిని ముందుగానే శత్రువులను చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ అన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Related Posts