Highlights
- జయలలిత 70వ జయంతి సందర్భంగా టూ వీలర్ తాళాలు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 70వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ టూ వీలర్ స్కీంను ప్రధాని ప్రారంభించారు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఐదు మంది మహిళలకు టూ వీలర్ తాళాలను అందజేశారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. వర్కింగ్ ఉమెన్స్ కోసం ఉద్దేశించిన ఈ పథకంలో టూ వీలర్ కొనుగోలుపై 50శాతం సబ్సిడీ అందజేస్తారు. రూ.25వేలు వరకు ప్రతి వాహనంపై సబ్సిడీ ఉంటుంది. ఈ పథకానికి 3 లక్షల 36వేల 103 మంది పనిచేస్తున్న మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి పళనిస్వామి వివరించారు.