YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

మీడియా పేరుతో బెదిరింపులు.. నలుగురిపై కేసు

మీడియా పేరుతో బెదిరింపులు.. నలుగురిపై కేసు

రూ.20 లక్షల డిమాండ్‌.. పోలీసులకు పట్టించిన యువత నలుగురిపై కేసు నమోదు
తెనాలి  : మీడియా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు కొందరు యువత. ఈ ఘటన తెనాలిలో జరిగింది. స్థానిక గంగానమ్మపేట లెక్చరర్స్‌ కాలనీలోని ఓ ఇంటిలో కొందరు యువత గ్రూపుగా ఏర్పడి కంపెనీల వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా క్రయ విక్రయాలు చేస్తున్నారు. మీపై వార్తలు రాస్తాం, పత్రికల్లో వస్తే ఇక అంతే సంగతులని విజయవాడకు చెందిన కమిలి అనే వారపత్రిక రిపోర్టర్‌ కృపారావు వారిపై బెదిరింపులకు దిగాడు. మాట్లాడుకుందాం రమ్మని మార్కెటింగ్‌ టీమ్‌ బాధ్యుడు నీలా సునీల్‌ మంగళవారం ఆహ్వానించి, కార్యాలయంలో రహస్య కెమెరాలను ఏర్పాటు చేశారు.
 
పత్రిక సంపాదకురాలు మండవ సౌజన్య, రిపోర్టర్‌ అప్పికొండ ప్రసాద్‌, దేవవరపు నరే్‌షబాబు వచ్చారు. సౌజన్య మాట్లాడుతూ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌కు జీఎ్‌సటి రూపంలో భారీ మొత్తంలో చెల్లించాలని, ఇవన్ని పత్రికలో రాస్తే రూ.కోటి వరకు కట్టాల్సి వస్తుందని, రూ.40 లక్షలు డిమాండ్‌ చేశారు. చివరికి రూ.20 లక్షలకు సరే అన్నారు. అనంతరం సునీల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై సీఐ బి.కళ్యాణ్‌రాజ్‌ కేసు నమోదు చేశారు. మండవ సౌజన్యది కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు కాగా, అప్పికొండ ప్రసాద్‌, దేవవరపు నరే్‌షబాబు, బోదాల కృపారావులది విజయవాడగా పోలీసులు తెలిపారు.

Related Posts