YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

ఆదివారం వర్మ ఓ శుభవార్త చెపుతారంట 

Highlights

  • వర్మ ట్రిపుల్ ధమాకా ఇస్తారంట
ఆదివారం వర్మ ఓ శుభవార్త చెపుతారంట 

ఇటీవల తాను తీసిన జీస్టీ వెబ్ సిరీస్ వలన పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నసంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నాగార్జునతో  తానుచేస్తున్న తాజా ప్రాజెక్ట్ కు సంబంధించి రేపు మధ్యాహ్నం రెండు గంటలకు మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. వర్మ  ఒకవైపు  కేసుళ్లను ఎదుర్కొంటూనే.. నాగార్జునతో చేస్తున్న తాజా ప్రాజెక్ట్ ని మాత్రం శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు. 28 ఏళ్ళ క్రితం వచ్చిన శివ చిత్రంతో సంచలనాలు క్రియేట్ చేసిన నాగార్జున- వర్మ కాంబినేషన్, ఆ తర్వాత చివరిగా 1992లో వచ్చిన అంతం సినిమా కోసం కలిసి పని చేశారు. మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత వీరిరివురు కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే మేజర్ పార్ట్ చిత్రీకరణ జరుపుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సమ్మర్ లో రిలీజ్ కానుంది. అయితే వర్మ కొద్ది సేపటి క్రితం ఈ మూవీకి సంబంధించి తన ట్విట్టర్ లో ఓ అప్ డేట్ ఇచ్చాడు.  నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రంలో మైరా సరీన్ అనే కొత్త అమ్మాయి కథానాయికగా నటిస్తుంది. కంపెనీ బేనర్ లో వర్మ నిర్మిస్తున్న ఈ మూవీలో కింగ్ నాగ్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నట్టు సమాచారం.

Related Posts