యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలలో బ్రాహ్మణ సామజిక వర్గానికి మూడు సీట్లను కేటాయించడంతో వైసీపీ అధినేత జగన్ కి ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్ రాష్ట్ర ప్రోగ్రామ్ చైర్మన్ కొప్పరపు వెంకట పురుషోత్తమరావు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో వాళ్ళు మాట్లాడుతూ
చంద్రబాబు బ్రాహ్మణులను అడుగడుగునా అవమానించారని అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, బ్రాహ్మణ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావుల విషయంలో చంద్రబాబు అవమానకర రీతిలో ప్రవర్తించారని విమర్శించారు.