యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
30సంవత్సరాలుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో టిడిపిని మించిన పార్టీ మరొకటి లేదు. ఆ పార్టీ తరుపున రాష్ట్రానికి మంత్రి పదవి చేసిన వారున్నారు. కానీ పరిస్థితితులు తలక్రిందులుగా మారాయి. ఒక్కప్పుడు జిల్లాలోనే హుజూరాబాద్, కమలాపూర్ నియోజకవర్గాల్లో టిడిపి బలమైన పార్టీగా ఉండేంది. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో జిల్లాలలో క్షేత్ర స్థాయిలో గులాబీ పార్టీ బలమైన శక్తిగా రూపంతరం చెందింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగా గులాబీ పార్టీ మరింత ప్రజల్లోకి వెళ్లడంతో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, గ్రామపంచాయతీ ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ప్రతిపక్ష ఉనికి ప్రశ్నార్థకమైంది. అయితే ఈ పరిణమాల నేపథ్యంలో టిడిపికి క్యాడర్ లేకుండా పోయిందనేది గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత పార్టీని నిలబెట్టుకునేందుకు మహాకూటమితో పొత్తుపెట్టుకొని ప్రయత్నించినప్పటికి ఫలించాలేదు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ నడిపే వారు గాని… పార్టీలో చేరే వారుగాని రానున్న జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదుహుజూరాబాద్ నియోజకవర్గంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉనికి కనుపించడంలేదు. క్రమంగా జనం సైతం టిడిపిని మర్చిపోతున్నారు. గ్రామాల్లో పార్టీ క్యాడర్ లేకపోవడంతో నియోజకవర్గంలో ఉన్న ఒక్కరు ఇద్దరు నేతలు సైతం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవుతున్నారు. రాష్ట్రంలో గులాబీ ప్రభజనం సృష్టించిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో టిడిపి ఉనికి క్లీన్ స్వీప్‌గా మారింది. అసెంబ్లీ ఎన్నికలు వెనువెంటనే జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ రెండింటిలో వీచిన గులాబీ గాలికి టిడిపి క్యాడర్ కనమరుగైందని గమనార్హం. పార్టీ కి నియోజకవర్గంగా సారథుల వెనుక క్యాడర్ లేకపోవడంతో చేసేది ఏమి లేక ఉనికి కోసం అప్పుడప్పుడు ప్రెస్ మీట్లకే పరిమితం అవుతున్నారు.