YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

వర్మ..ఎక్కడ తగ్గట్లేదుగా....

వర్మ..ఎక్కడ తగ్గట్లేదుగా....

యువ న్యూస్ ఫిలిం బ్యూరో: 

ఒక వైపు ఎన్నికల వేడి ఉంటే.. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంలో ఈ వేడిని రెట్టింపుచేస్తున్నారు వివాదాల దర్శకుడు వర్మ. ఎన్నికలు కోడ్ అమలులో ఉండగా.. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఎలాగైనా అడ్డుకోవాలని తెలుగుతమ్ముళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు వర్మ కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ సెన్సార్ బుధవారం పూర్తి చేసుకోనుంది. అయితే సెన్సార్ బోర్ట్ క్లియరెన్స్ ఇస్తుందా అంటే సందేహాలు రాక మానవు. మార్చి 22న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ధీమాగా చెబుతున్నారు. అయితే ఇంత వరకూ సెన్సార్ పూర్తి కాలేదు. బుధవారం నాడు అంటే మార్చి 20న సెన్సార్ నుండి క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏవైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటే తొలగించడానికి సర్దుబాట్లు చేయడానికి మధ్యలో ఒక్క రోజు సమయం ఉంటుంది. అయితే ఖచ్చితంగా సెన్సార్ నుండి ఈ సినిమాకు అభ్యంతరాలైతే ఉండనే ఉంటాయి. ఈ లెక్కన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒకటి రెండు రోజులు పాటు వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా విడుదలౌతుందా లేదా అన్న సందిగ్ధత ఉంటే.. వర్మ మాత్రం తన ప్రమోషన్స్ మంత్రాన్ని జపించడం మానడం లేదు. తాజాగా నందమూరి తారకరామారావు గారి పాపులర్ ఫొటోని మార్ఫింగ్ చేసి అన్నగారి ఫేస్‌కి బదులుగా వర్మ ఫొటో పెట్టేసుకున్నాడు. ఇది ఆయన ఫ్యాన్స్ పంపారో లేక ఆయన దర్శకత్వ ప్రతిభనో తెలియదు కాని.. ‘ఎన్టీఆర్ లుక్ ఒకర్ని పోలినట్టు ఉంది.. అతనెవరో మీకు తెలుసా?’ అంటూ ఈ మార్ఫింగ్ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టేశాడు. పోల్చుకుంటే పోల్చుకోవచ్చుగాని.. మరీ ఎన్టీఆర్‌తో పోల్చుకోవడం ఏంటి? వర్మా.. మా కర్మ కాకపోతే అని ఎన్టీఆర్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ముందే వర్మ విన్యాసాలు ఈ రేంజ్‌లో ఉంటే విడుదల తరువాత ఇంకెన్ని సిత్రాలు చూపిస్తారో చూడాలి. 
29వ తేదీకి సినిమా రిలీజ్ వాయిదా
సినీ, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కలిగిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వాయిదా పడింది. ఈ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్‌కి తెరదించుతూ.. సినిమా వాయిదా పడినట్టు వర్మ తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను లక్ష్మీ పార్వతి కోణంలో తెరకెక్కిస్తున్న వర్మ.. ఈ మూవీ టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై అంచనాలను పెంచాశారు. దీనికి తోడు ఈ సినిమా సరిగ్గా ఎన్నికలు ముందు విడుదల కానుండటంతో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో ఎలాగైనా అడ్డుకునేందుకు తెలుగు తమ్ముళ్లు ప్రయత్నింగా.. ఏది ఏమైనా అనుకున్న సమయానికి అంటే మార్చి 22న ఖచ్చితంగా విడుదల చేస్తానని వర్మ తెగేసి చెప్పారు. అయితే టెక్నికల్ పరమైన సమస్యలు తలెత్తడంతో ఈ సినిమాను 29కి వాయిదా వేశారు. కాగా చట్ట విరుద్ధంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాని అడ్డుకునేందుకు సెన్సార్‌ బోర్డు ప్రయత్నిస్తోందని ఈ విషయమై కోర్టుకు వెళ్లి కేసు దాఖలు చేస్తున్నట్టు ప్రకటించిన వర్మ ఆ తరువాత కొద్దిసేపటికే సెన్సార్‌తో ఉన్న అపార్ధాలు తొలగిపోయాయని.. తప్పుగా అర్ధం చేసుకోవడం వల్ల ఇలా జరిగిందని.. సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు వర్మ. అయితే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో 29కి వాయిదా పడింది.  వర్మ ఎంత ప్రయత్నించినా మార్చి 22న విడుదల చేయడం సాధ్యమయ్యే పనికాదు. సినిమా బుధవారం (మార్చి 20) నాడు సెన్సార్ స్క్రీనింగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ వివాదాస్పద మూవీకి సెన్సార్ నుండి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. స్కీనింగ్ అనంతరం అభ్యంతరకరమైన సీన్లు, సంభాషణలు ఉంటే తొలగించి రీ స్క్రీన్ చేయడానికి సెన్సార్ నుండి క్లియరెన్స్ రావడానికి టెక్నికల్ సమస్యలు తలెత్తవచ్చు. ఈ తరంగం అంతా ఒక్కరోజులో అయ్యే పని కాదు. ఇవేకాక ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి పోషించిన పాత్రను అలాగే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌ని చివరి రోజుల్లో ఎలాంటి మానసిక క్షోభకు గురిచేశారు. లక్ష్మీ పార్వతిని ఎలా వేధించారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు లాంటి కీలకమైన అంశాలను చూపించబోతున్నారు. ఈ తరుణంలో చంద్రబాబును విలన్‌గా చూపించబోతున్నారు వర్మ. ఇదే జరిగితే ఈ సినిమా ప్రభావం ఎన్నికల్లో ఎంతో కొంత ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఈ కారణంగా సినిమాను ఆపే శక్తి సెన్సార్ బోర్డ్‌‌కు లేదని వాదించిన వర్మ సెన్సార్ ముందు తలొంచకతప్పలేదు

Related Posts