యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మంత్రాలయం నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి మంగళవారం కూడా ఒక్క దరఖాస్తు కూడా రాలేదని మంత్రాలయం నియోజకవర్గం ఎన్నికల రిటర్నింగ్ అధికారి మోహన్ దాస్ తెలిపారు. 21 తేది హోళీ పండుగ, 24 తేది ఆదివారం సెలవు .ఇంక 20, 22,23,25వ తేదీలో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉంది ఇందులో 22 శుక్రవారం. 25 సోమవారం లో ఎక్కువగా నామినేషన్లు దాకలయ్యోఅవకాశంఉంది . అభ్యర్థులు తమ దరఖాస్తులను మంత్రాలయం రెవెన్యూ కార్యాలయం లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గాని అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి గాని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అసెంబ్లీ స్థానాలకు దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని సూచించారు. కార్యాలయానికి వంద అడుగుల దూరం నుండే తమ వాహనాలను ఆపివేసి కేవలం అభ్యర్థి తో పాటు నలుగురు మాత్రమే మే వచ్చి ఎన్నికల అధికారికి తమ దరఖాస్తు పత్రాలను అందజేయవలసి ఉ ఉంటుందని మంత్రాలయం ఎన్నికల అధికారి మోహన్ దాస్ తెలిపారు. స్థానిక సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు రాఘవేంద్ర సర్కిల్ నుండి జిల్లా ఉన్నత పాఠశాల వరకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .