Highlights
సినీ నటి శ్రీదేవి కన్నుమూత
తీవ్ర దిగ్భాంతిలో భారత సినీ పరిశ్రమ
ప్రముఖుల దిగ్భ్రాంతి
తీవ్రంగా స్పందించిన వర్మ
ప్రముఖ సినీనటి శ్రీదేవి కన్నుమూశారు. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లారు. ఓ పెళ్లివేడుకకు హాజరై, అక్కడే గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 2.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. శ్రీదేవి మరణవార్త విని భారత సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నటించారు. శ్రీదేవి మరణం షాక్ కు గురి చేసిందని సీని ప్రముఖులు అంటున్నారు.
శ్రీదేవి మృతి పట్ల సంతాప ప్రకటనలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీదేవి మృతి పట్ల భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం చంద్రబాబు, కేసీఆర్ లు సంతాపం తెలిపారు.
తనని తాను శ్రీదేవి ఆరాధకుడిగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో తీవ్రంగా స్పందించారు. ఇంతలా దేవుణ్ని ఎప్పుడూ ద్వేషించలేదంటూ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ‘ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. శ్రీదేవి ప్రేమించే అందరికి నా సంతాపం’ అంటూ ట్వీట్ చేశారు.
టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ ‘నాకు ఈ విషయం నమ్మాలని లేదు. ఓ లెజెండ్ ఇక లేరు. భారతీయ సినీ చరిత్రలో ఆమె స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేర’ని ట్వీట్ చేశారు. సినీ ప్రముఖులు సుస్మితాసేన్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, రితేష్ దేశ్‌ముఖ్, అనుష్క శర్మ, అను ఇమ్మాన్యూల్, ప్రీతీ జింతా, సిద్ధార్థ్ మల్హోత్రా, జానీ లివర్, జరీన్ ఖాన్, మధుర్ బండార్కర్, అద్నాన్ సమీ, గౌతమి తదితరులు సోషల్ మీడియాలో స్పందించారు.