యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కడప రాజకీయాల్లో కీలక పరిణామం. సీనియర్ నేత, వైఎస్ సమకాలీకుడు అయిన డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. బుధవారం నాడు ఆయనతో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు వైసీపీ అభ్యర్ధి రఘురామిరెడ్డి సమావేశం అయి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ‘వైఎస్ జగన్ నాకు ఫోన్ చేశారు. మీ సేవలు అవసరం పార్టీలోకి రావాలని కోరారు. చాలా సంవత్సరాలుగా వైఎస్ ఆర్ కుటుంబసభ్యుడిని. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకుంటానని,పది రోజుల్లో భారీ సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.అలాగే రాష్ట్రంలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తానన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి స్థానాన్ని భర్తీ చేయాలని జగన్ కోరారు’ అని తెలిపారు. సజ్జల రామకృష్ష్ణారెడ్డి మాట్లాడుతూ.. డీఎల్ రవీంద్రారెడ్డి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన రాకతో పార్టీలో నూతన ఉత్సహం వస్తుంది. అధికారంలోకి రాగానే డీఎల్‌కు ప్రత్యేక స్థానం ఇస్తామని వైఎస్ జగన్ చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నా రు. ఏపీలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని డీఎల్ ఆరోపించారు.