యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇండియన్ స్టాక్ మార్కెట్ బుధవారం కూడా లాభాల్లోనే ట్రేడవుతోంది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు గ్యాప్‌అప్‌తోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ తన మునపటి ముగింపు 38,363 పాయింట్లతో పోలిస్తే 70 పాయింట్ల లాభంతో 38,433 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 11,532 పాయింట్లతో పోలిస్తే 21 పాయింట్ల లాభంతో 11,553 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. నిఫ్టీ 50లో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, విప్రో, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ, వేదాంత, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫోసిస్ దాదాపు 3 శాతం మేర పెరిగింది. అదేసమయంలో హెచ్‌పీసీఎల్, జీ ఎంటర్‌టైన్‌మెంట్, బీపీసీఎల్, ఐఓసీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, కోల్ ఇండియా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌పీసీఎల్ 4 శాతానికి పైగా పడిపోయింది. సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మీడియా, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్, నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ ఆటో, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్‌లు నష్టాల్లో ఉన్నాయి. మిగతావి లాభాల్లో కదలాడుతున్నాయి