YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగుదేశంలో కలకలం రేపుతున్న సర్వే!

తెలుగుదేశంలో కలకలం  రేపుతున్న సర్వే!

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:  

ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని టీడీపీ..ఈ సారి గెలుపు విజయాలకు చేరుకుని తీరాలని వైసీపీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే జాతీయ ఛానళ్ళ సర్వేలు మెజారిటీ వైసీపీకి అనుకూలంగానే వస్తున్నాయి. అయితే వాటిని మాత్రం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘ దొంగ సర్వేలు’ అంటూ తేలిగ్గా తీసిపడేసే ప్రయత్నం చేస్తున్నారు. తమకు అనుకూలంగా లేకపోతే అలాంటికి ఏదో ఒక ‘ముద్ర’ వేయటంలో చంద్రబాబు సిద్ధహస్తుడు అనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెల్లడైన ఓ సర్వే మాత్రం టీడీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అది కూడా సర్వేల స్పెషలిస్ట్ అస్మదీయ నేతల కోసం చేసిన ‘అంతర్గత సర్వే’. ఆ సర్వేలో తేలింది ఏమిటయ్యా అంటే గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ ఓటర్లు వైసీపీవైపే ఉన్నారని. లెక్కల్లో తేడా  చాలా విస్పష్టంగా కన్పిస్తోందని..ఇదే ట్రెండ్  కొనసాగితే మాత్రం ఫలితాలు అధికార పార్టీకి చేదు అనుభవాన్ని మిగల్చటం ఖాయం అని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ చాలా చోట్ల ప్రతిపక్ష వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని తేలటంతో రాబోయే రోజుల్లో టీడీపీ మరింత దూకుడు పెంచటం ఖాయంగా చెబుతున్నారు. గెలుపు అవకాశాలపై అనుమానంతోనే చంద్రబాబు ఎన్నికల ముందు పెన్షన్ పెంపు, అన్నదాత సుఖీభవ, డ్యాకా మహిళలకు పసుపు-కుంకుమ వంటి స్కీమ్ లను ఆగమేఘాల మీద అమలుపర్చారు. అయినా సరే  వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా మారకపోవటం టీడీపీ నేతల్లో చర్చనీయాంశంగా మారింది. అందునా తొలిసారి టీడీపీ ఒంటరిగా పోటీచేస్తుంది. ఒంటరిగా పోటీ చేసి చంద్రబాబు విజయం సాధిస్తారా?. ఇది తేలాలంటే మే 23 వరకూ వేచిచూడాల్సిందే. ప్రస్తుతానికి అయితే ‘టెన్షన్ టెన్షన్’.

Related Posts