YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆటలు

టి20లో భారత్‌ జయకేతనం

Highlights

ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌

 

సిరీస్‌ 2–1తో కైవసం

రాణించిన ధావన్, రైనా

డుమిని, జాన్‌కర్‌ శ్రమ వృథా

సఫారీ టూర్ లో  ఆఖరి పంచ్‌ మనదే

టి20లో భారత్‌ జయకేతనం

 దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్‌ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్‌కర్‌ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్‌ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్‌ రైనాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్‌ స్థానంలో క్రిస్టియన్‌ జాన్‌కర్‌ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్‌ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్‌ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్‌ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు.  
రైనా మెరుపులు... ధావన్‌ నిలకడ 
టాస్‌కు కోహ్లి కాకుండా రోహిత్‌ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత కూడా రోహిత్‌ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్‌లో అతడి పేలవ ఫామ్‌ కొనసాగింది. మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్‌ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్‌ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్‌ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ బాదాడు. ఓవైపు ధావన్‌ టైమింగ్‌ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్‌ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్‌ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్‌ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో మనీశ్‌ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్‌) వికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి డాలా విసిరిన డైరెక్ట్‌ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్‌), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్‌ ఝళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్‌ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో  స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది. 

Related Posts