Highlights
- ఓబీసీకి 390 కోట్ల రుణం ఎగవేసి పారిపోయిన ఢిల్లీ వ్యాపారి
- రుణాల ఎగవేతలపై సీబీఐకి బ్యాంకుల ఫిర్యాదు.. కేసులు నమోదు
- శనివారం రూ.523 కోట్ల నీరవ్ ఆస్తులు అటాచ్
- నీరవ్, చోక్సీల పాస్‌పోర్టులు రద్దు
- బ్యాంకుల ఫిర్యాదుతో మరో మూడు కేసులు
పీఎన్‌బీ, రొటొమ్యాక్ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగుతుండగానే మరో బ్యాంకు కుంభకోణం వెలుగు చూసింది.ఢిల్లీకి చెందిన వజ్రాల నగల ఎగుమతిదారు ద్వారకాదాస్ సేథ్.. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ)కు రూ.389.85కోట్ల రుణం ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయాడు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌ను రూ.390కోట్లకు ముంచేసిన ఓ కేసు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2007–12 మధ్య రూ.389 కోట్లమేర ఓబీసీ నుంచి రుణాలు పొందింది. ఆ తర్వాత గుర్తుతెలియని సంస్థలతో ఈ సంస్థ లావాదేవీలు జరుగుతున్నాయని బ్యాంకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు ఇచ్చిన ‘లెటర్ ఆఫ్ క్రెడిట్స్’ను అడ్డం పెట్టుకుని బయటి వ్యక్తుల దగ్గర బంగారం, వజ్రాభరణాలపై మరిన్ని రుణాలు తీసుకున్నారని, విదేశాలతో అనుమానాస్పద లావాదేవీలు జరుగుతున్నట్లు గుర్తించామని బ్యాంకు అధికారులు సీబీఐకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ద్వారకాదాస్ సేథ్‌తో పాటుగా ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్త, ఓ బ్యాంకు అధికారి మోసం చేశారంటూ మూడు వేర్వేరు బ్యాంకులు ఈవారం ప్రారంభంలోనే సీబీఐకి ఫిర్యాదు చేశాయి. వీటి ఆధారంగా సీబీఐ కేసు నమోదు చేసింది. బుధ, గురువారాల్లోనే ఈ కేసులు నమోదైనా ఆలస్యంగా వెలుగుచూశాయి. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, నేరపూరితంగా చట్టాలను దుర్వినియోగం చేసి రుణాలు పొందారంటూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇచ్చిన ఫిర్యాదుమేరకు అమిత్ సింగ్లా అనే వ్యాపారవేత్తపై కేసు నమోదైంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పీఎన్‌బీ బార్మర్ బ్రాంచ్ మాజీ మేనేజర్ ఇందర్‌చంద్ చుండావత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీని ఆధారంగా తాజాగా సంస్థ డైరెక్టర్లుగా ఉన్న సభ్య సేథ్, రీటా సేథ్, కృష్ణ కుమార్ సింగ్, రవిసింగ్‌లతోపాటుగా ద్వారకాదాస్ సేథ్ సెజ్ ఇన్ కార్పొరేషన్ సంస్థపైనా సీబీఐ కేసు నమోదు చేసింది. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. ‘ద్వారకాదాస్ సేథ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రుణఎగవేతకు పాల్పడినట్లు ఆరు నెలల క్రితమే బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.