YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

బ్యాంకులను మళ్లీ చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు

Highlights

  • తెలుగు రాష్ట్రాల్లోని 60 శాతం నో క్యాష్
  • ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు భయంతో పెరిగిన విత్‌డ్రాలు
  • ఐటీ నోటీసుల ఆందోళనతో తగ్గిన డిపాజిట్లు
  • పెరుగుతున్న డిఫాల్టర్లతో ఖాతాదారులు దూరం
  • విత్‌డ్రా చేసుకునేవారికి నగదు సర్దలేక బ్యాంకులు సతమతం
  • ఏటీఎంల పరిస్థితి మరీ ఘోరం..
  •  పనిచేస్తున్నవి 20 శాతమే
బ్యాంకులను మళ్లీ చుట్టుముట్టిన కరెన్సీ కష్టాలు

మనకు తక్షణం ఎదురవుతున్న ప్రమాదమేంటి? ఇంకేముంది. మళ్లీ పెద్ద నోట్ల రద్దునాటి పరిస్థితే. అప్పట్లోనైతే కొత్త నోట్లు లేవు. కాబట్టి ఏటీఎంల్లో, బ్యాంకుల్లో నోట్ల కొరత ఏర్పడింది. దాచుకున్న డబ్బులు చేతికివ్వలేని బ్యాంకులపై జనం విశ్వాసం తగ్గటానికదే నాంది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా ఎగవేతదారులు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. ఇంతలో.. ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు వస్తోందంటూ కథనాలు ఖాతాదారుల్ని కంగారెత్తించాయి.

రెండు లక్షలకన్నా ఎక్కువ డిపాజిట్‌ చేసినవారికి వచ్చిన ఐటీ నోటీసులు.. ఆ కంగారును మరింత పెంచాయి. ఇక వీటన్నిటినీ మరిచిపోయే దెబ్బకొట్టాడు నీరవ్‌ మోదీ. రూపాయి హామీ లేకుండా ఏకంగా 11,400 కోట్లను దేశం దాటించేసి తానూ పరారైన నీరవ్‌.. భారతీయ బ్యాంకుల ఆయువుపట్టుపై కొట్టాడు. ఆ దెబ్బ జనం విశ్వాసానికి రాసిన మరణ శాసనమే! నిపుణుల మాటల్లో చెప్పాలంటే.. వీటి నుంచి మన బ్యాంకులు తేరుకోవటం అంత తేలికేంకాదు..! మరి 15 నెలల తర్వాత.. అదికూడా వేల కోట్ల నగదును ముద్రించి పంపించాక కూడా ఎందుకిలా?

ఎందుకంటే వరస పరిణామాలతో బెంబేలెత్తుతున్న జనం.. బ్యాంకుల్లో డిపాజిట్లను తగ్గించేశారు.

 

Related Posts