యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఆలస్యం చేస్తోందని నిరసిస్తూ ఆయన ర్యాలీ నిర్వహించ తలపెట్టడంతో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ర్యాలీకి అనుమతివ్వలేమని పోలీసులు స్పష్టంచేశారు. శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలకు సంబంధించి రూ.9 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లింపుల్లో ప్రభుత్వం ఏళ్ల తరబడి జాప్యం చేస్తోందని మోహన్ బాబు ఆరోపించారు.