YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వాణిజ్యం

 సీఐఐ భాగస్వామ్య సదస్సు ముచ్చట్లు 

Highlights

  • ఉత్సహ వాతావరణంలో పెట్టుబడుల సదస్సు 
  • ఎటుచూసిన పారిశ్రామిక వేత్తలే... 
  • ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల హడావుడి 
  • అరకు కాఫీరుచి గా ఉంది..
 సీఐఐ భాగస్వామ్య సదస్సు ముచ్చట్లు 

మూడు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు శనివారం అత్యంత ఉత్సాహ వాతావరణంలో ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచే పారిశ్రామిక ప్రతినిధుల రాక మొదలైంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్త నుంచి... బడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి  ప్రభుత్వ ఉన్నతాధికారులు, మంత్రులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. ఎటుచూసినా వారిదే హడావుడి.సాధారణ కార్ల నుంచి బీఎండబ్ల్యూ వంటి పెద్ద పెద్ద కార్లలో పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. భాగస్వామ్య సదస్సు నిర్వహణపై ప్రభుత్వం దేశవిదేశాల్లో భారీగానే ప్రచారం చేసింది. దీంతో జపాన్‌, కొరియా, శ్రీలంక, యూఏఈ తదితర 60 దేశాల నుంచి 230 మంది పారిశ్రామికవేత్తలు, ట్రేడ్‌ మంత్రులు, ఇతర ప్రముఖులు తరలివచ్చారు. దేశ నలుమూలల నుంచి మరో 2,500 మంది ప్రతినిధులు తరలివచ్చారు. ప్రతినిధులకు ప్రవేశ ద్వారం వద్ద సాదర స్వాగతం లభించింది. ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతుండంతో పోలీసు వర్గాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. భద్రత బలగాలు ప్రవేశద్వారం వద్ద అణువణువూ నిశితంగా పరిశీలించాయి. వాహనాల్లో వచ్చిన వారిని ప్రవేశద్వారం వద్ద దింపేసి లోపలకు అనుమతించారు. ముఖ్యులు, ప్రొటోకాల్‌ పరిధిలోని వారి వాహనాలను లోపలకు అనుమతించారు. అయిదు హాళ్ల వద్ద కూడా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. సీఐఐ జారీ చేసిన గుర్తింపు కార్డు ఆధారంగా ప్రతినిధులు, అతిథులను లోపలకు అనుమతించారు. కొత్తకొత్త అంశాలను తెలుసుకోవాలనే ఉత్సాహంతో వచ్చాను. భవిష్యత్తులో నాకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుంది. వివిధ అంశాలపై మరింత అవగాహన కూడా వచ్చింది. ప్రస్తుతం బీటెక్‌ ప్రధమ సంవత్సరం చదువుతున్నాను. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వివిధ దేశాల ప్రతినిధులు మాట్లాడిన విషయాలను అవగాహన చేసుకొన్నాను. నా చదువు అనంతరం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మంచి అవగాహన వచ్చింది.


అరకు కాఫీ...
అరకు కాఫీని పలువురు ప్రతినిధులు రుచి చూశారు. సమావేశ మందిరానికి ఎదురుగా ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. లేపాక్షి హస్తకళలతో పాటు చేనేత చీరలు, పట్టు, జెరీ చీరలు, విభిన్న రకాల కళలతో కూడిన వస్తువులు కొలువుదీరాయి. జీసీసీ ఏర్పాటు చేసిన స్టాలులో వారి వస్తువులను ప్రదర్శించారు. అక్కడే కాఫీ రుచులను ప్రతినిధులు అస్వాదించారు. అత్యధికులు అక్కడ కాఫీ తాగి బాగుందని కితాబిచ్చారు. 
కుప్పకూలిన పోలీసు 
విధి నిర్వహణలో ఉండగా ఆర్మ్‌డ్‌ విభాగానికి చెందిన పీసీ 531 నెంబరు కానిస్టేబుల్‌ బి.శంకర్రావు ఫిట్స్‌ వచ్చి కుప్పకూలిపోయారు. ఉపరాష్ట్రపతి కాన్వాయి తిరుగు ప్రయాణమవుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన సహచరులు అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. 
ఇదిలా ఉండగా... ఎవరికి కేటాయించిన విధులను వారు నిర్వహిస్తూ సేవలందించారు. మరుగుదొడ్లు, టాయిలెట్స్‌తో పాటు ప్రాంగణమంతా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య సిబ్బంది విధుల్లో నిమగ్నమయ్యారు.


* ఉదయం 9 గంటల నుంచే రిజిస్ట్రేషన్‌ కౌంటర్ల వద్ద హడావుడి మొదలైంది. ప్రతినిధులు గుర్తింపు కార్డులు, అతిథులకిచ్చే కిట్ల కోసం బారులు తీరారు. 
* విదేశాల నుంచి వచ్చిన కొంతమంది అతిథులు తమ వెంట తెచ్చుకున్న ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర విలువైన పరికరాలను సైతం భద్రత సిబ్బంది తనిఖీ చేశారు. దీంతో కొంతమంది ఔత్సాహికులు ఇబ్బంది పడ్డారు. ఇవేం తనిఖీలంటూ నిట్టూర్చారు. నీ దిగ్గజ పారిశ్రామికవేత్త అదాని ప్రారంభ సమావేశం తర్వాత వెనుదిరిగారు. 
* ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వేదిక వద్దకు చేరుకున్నారు. రాష్ట్రమంత్రులు, జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు స్వాగతం పలికారు. 
* సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులు పలువురు ఉదయమే వేదిక వద్దకు చేరుకున్నారు. తమ శాఖల పరంగా చేసిన ఏర్పాట్లు, ఎంవోయూలు తదితర అంశాలపై దృష్టి సారించారు. 
* సదస్సు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొదలైంది. అప్పుడు సమావేశ మందిరమంతా ప్రతినిధులు, అతిథులతో కిక్కిరిసిపోయింది. మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ముందు వరసలో కుర్చీలు కేటాయించారు. 
* వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల సేవల్లో సీఐఐ ప్రతినిధులు నిమగ్నమయ్యారు. వారికి కేటాయించిన సీట్ల వద్దకు తీసుకెళ్లి సాదరంగా ఆహ్వానం పలికారు. అయితే సమావేశ మందిరం నిండిపోవడంతో కొంతమంది విదేశీ ప్రతినిధులు కుర్చీల కోసం వెతుకోవాల్సి వచ్చింది. 
* సదస్సు ప్రారంభ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ప్రాముఖ్యతను ప్రస్తావించినప్పుడు ప్రతినిధుల నుంచి మంచి స్పందన వచ్చింది. 
* కియా సంస్థ ఉత్పత్తి చేసిన కార్లను ప్రదర్శనలో ఉంచారు. ఇవి పలువురిని ఆకట్టుకున్నాయి.

.


 

Related Posts