యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కీ.శే. వెలుగూరి వెంకటేశ్వరులు గారి కుమారుడు వెలుగూరి శరత్ బాబు గారు సత్తెనపల్లి వై ఎస్ ఆర్ సీపీ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు గారి గెలుపు కోసం సత్తెనపల్లి వచ్చి అహర్నిశలు కృషి చేస్తున్నారు.. శరత్ బాబు గారి తండ్రి శ్రీ వెంకటేశ్వరులు గారు సత్తనెపల్లి సర్పంచ్ గా పని చేయడమేగాక , రాష్ట్రంలోని ప్రముఖ వైశ్యులలో ఒక డైనమిక్ లీడర్ గా గుర్తింపు పొందటమే కాక రాష్ట్రంలో సత్తనెపల్లి వైశ్యులకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి వెంకటేశ్వరులు గారు. ఆనాడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి ప్రత్యర్థి గాదె వీరాంజనేయ శర్మ గారిని సత్తెనపల్లి అభ్యర్థిగా గెలిపించి గోపాలకృష్ణయ్య గారి ఓటమికి కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా వారి తండ్రి శ్రీ శరభయ్య గారు స్థాపించిన శరభయ్య హైస్కూల్ కీ సెక్రటరీగా పని చేసి శరభయ్య హైస్కూలుకి మంచి పేరు ప్రతిష్టలు గడించి ఎంతో మంది పేద పిల్లలకు కులమతాలకు అతీతంగా విద్య దానం చేసిన వ్యక్తి వెలుగూరి వెంకటేశ్వరులు గారు.
ఆయన బాటలోనే ఆయన పెద్ద కుమారుడు వెలుగూరి విజయకుమార్ గారు మున్సిపల్ చైర్మన్ గా పని చేసి ఆ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అదించారు. తండ్రి, అన్నయ్య బాటలో శరత్ బాబు గారు 10 సంవత్సరాలు పాటు సత్తెనపల్లి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు గా పని చేసి సత్తెనపల్లి లో రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికలలో, రెండు సార్లు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలవడానికి కృషి చేసారు. సత్తెనపల్లి నియోజకవర్గం అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది. ఇది అక్షర సత్యం. అందుకని సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు గారిని, నర్సారావు పేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని విశేష కృషి చేస్తున్నారు. 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన రాజకీయ కుటుంబం వీరిది. ఈ నాడు శరత్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ ని వీడి వైస్సార్ కాంగ్రెస్ లో చేరి సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు గారిని, నర్సారావు పేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీ కృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కృషి చేస్తున్నారు. వీరి కుటుంబం మూడు తరాలుగా కోట్ల ఆస్తులను రాజకీయాలలో ఖర్చు చేశారు. ఏనాడు రాజకీయాన్ని వ్యాపారంగా చూడని కుటుంబం. s for sucess.... sarath for sucess..... ఆయన పేరులోనే సక్సస్ ఉంది. తప్పకుండా శరత్ గారి అధ్యర్యంలో సత్తెనపల్లి, నర్సరావుపేట అభ్యర్థులు సక్సస్ అవుతారు సత్తెనపల్లి ప్రజలు విశ్వసిస్తున్నారు.