యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నామినేషన్లు ఈ నెల 23,24 తేదీల్లో స్వీకరించబడవని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ యస్. సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెగోషియబుల్ ఇన్ స్టుమెంట్ చట్టం ప్రకారం 23వ తేదీ (నాలుగవ శనివారం) బ్యాంకులకు , 24వ తేదీ ఆదివారం వెరశి రెండు రోజులు సెలవులు ఉన్నందున సదరు తేదీల్లో నామినేషన్లు స్వీకరించడం జరగదన్నారు. ఎన్నికల కమీషన్ అదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ అంశాన్ని నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్ధులు గమనించాలన్నారు. అయితే ఈ నెల 25 న (సోమవారం) నామినేషన్లు దాఖలుకు చివరి రోజు అన్ని, ఆరోజు ఉదయం 11 గం నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లు స్వీకరిస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.