సాధారణ ఎన్నికలు సమీపిస్తున్నవేళ విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్లు జనసేన వైపు ఆసక్తిగా చూస్తున్నట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. జనసేన ఆవిర్భాం, పవన్‌కల్యాణ్ సినీ క్రేజ్ చూసి ఇది వరకు జనం సాధరణం అనుకున్నారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిపిఎం, సిపిఐ, జనసేన, బిఎస్‌పిలు కలిసి ఒక కూటమిగా ఏర్పడడంతో మార్పు కోరుకునేవారు దీనిని ఆహ్వానిస్తున్నారు. దీనికి తోడు తూర్పులో రెండు దఫాల టిడిపి అవినీతి పాలన, పరిష్కారం కానీ ప్రజా సమస్యలు ఈ దిశగా ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. దీన్ని బలపరుస్తూ సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఓటర్లలో ఒకరకమైన ఆసక్తి కనబడుతోంది. మరోవైపు జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ గాజువాక అసెంబ్లీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేయడంతో తూర్పు ఓటర్లు జనసేన పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏ ఇద్దరిని కదిపినా దీని గురించే చర్చ సాగుతోంది. జనసేన పాలన వస్తే బాగుంటుందేమో అంటూ ఆశక్తిని కనబరుస్తున్నారు. ఈ రకమైన చర్చ చాలా చోట్ల వినిపిస్తోంది. తూర్పు నియోజకవర్గంలో మార్పు అవసరమని అది జనసేనతోనే సాధ్యమవుతుందనే భావన ఓటర్లలో కనిపిస్తోంది. రెండు దఫాలా టిడిపి పాలనలో తీరని సమస్యలు, కానీ అభివృద్ధితో జనం విసుగు చెందారు. వాటిని మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, జనసేన, బిఎస్‌పిలు కలిసి కూటమిగా ఏర్పడి ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం చేస్తుందని ఆశపడుతున్నారు. ముఖ్యంగా టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు విమ్స్ ప్రయివేటీకరణకు మద్దతు తెలిపారు. విమ్స్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం పెద్ద ఎత్తున దశలవారీ పోరాటం చేసి, చివరకు విజయం సాధించింది. పంచగ్రామా భూ సమస్య, తాగునీటి సమస్య, ఇలా ఇప్పటికీ పరిష్కారం కానీ సమస్యలు ఉన్నందునే ప్రజల మార్పు కోరుతున్నారు. ఈ సమస్యలపై నిరంతరం ఉద్యమించి, ప్రజా సంక్షేమంకోసం కష్టించి, కృషి చేసే వామపక్షాల మద్దతుతోపాటు నీతివంతమైన అధికారిగా విఆర్‌ఎస్ తీసుకున్న వివి లక్ష్మీనారాయణ జనసేన వైపు నిలవడం, ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం, పవన్‌కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చానని, చెప్పడంతో తూర్పు ప్రజలు జనసేనను కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎటూ తేల్చుకోలేక నిలకడగా ఉన్నవారు కాస్తా గాజువాకలో పవన్‌కల్యాన్ నామినేషన్, జనకోలాహలం చూసి జనసేనవైపు మగ్గుతున్నారని చెప్పక తప్పడడంలేదు. ఏదిఏమైనా తూర్పులో ఓటర్ల మార్పు కోరుకుంటున్నారు.