YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

కొత్త సినిమాను ఒకే చేసిన రజనీ 

Highlights

  •  మార్చి 1 న కాలా టీజర్ వచ్చేస్తుంది
  •  ఏప్రిల్ 27న చిత్రం విడుదల 
కొత్త సినిమాను ఒకే చేసిన రజనీ 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వైపు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. మరో వైపు సినిమాల్లోనూ బిజీగా సాగుతున్నారు. ఇఫ్పటికే రజనీకాంత్ నటించిన సినిమాలు కాలా, 2.ఓ విడుదల కావాల్సి ఉంది. రకరకాల కారణంతో 2.ఓ సినిమా విడుదలలో విపరీత జాప్యం జరుగుతోంది. త్వరలోనే కాలా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు రజనీకాంత్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించటానికి రెడీ అయ్యారు. కార్తీక్ సుబ్బరాజు పిజ్జా సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఈ దర్శకుడు రజనీ కోసం ఓ కథను సిద్ధం చేయగా..ఇది ఈ సూపర్ స్టార్ కి కూడా బాగా నచ్చింది. దీంతో వెంటనే సినిమాకు ఓకే చెప్పేశాడు. రజనీ కాలా సినిమా విడుదల ముహుర్తం ఇప్పటికే ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ను మార్చి 1 వ తేదీన విడుదల చేయనున్నారు. 2.ఓ విడుదలపై మాత్రం ఇంత వరకూ క్లారిటీ లేదు.
 

 

Related Posts