YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సండే..సందడే..సందడి..

Highlights

  • నాడు దొంగలు - నేడు దొరలు
  • పేపరుకు అందని వార్తలు
  • ఆకర్షణీయమైన శీర్శికలు
సండే..సందడే..సందడి..

ఈవారం అన్ని దినపత్రికలు బ్యాంకు స్కాం వార్తలను ఆకర్షణీయమైన రీతిలో అందించాయి.
ఈనాడు డిజిటల్ వార్తలకు పదును పెట్టగా, సాక్షి 'ప్రత్యేకహోదా' విషయంతో ఏ.పి.ప్రభుత్వాన్ని బాగానే ఇరుకున పెట్టింది. 'నమస్తే తెలంగాణ' రాజకీయ ప్రత్యర్థులపై దాడి పెంచింది.
నవ తెలంగాణ ''మాఫీ'పై కూపీ"' వార్త ఆలోచింప చేసింది. ఆంద్రజ్యోతి, ప్రభ, భూమి,  వార్త, మన, మనం‌ పత్రికలు విభిన్నంగా వార్తలు అందించగా... వార్త ఖమ్మం ఎడిషన్ కు ఇటీవల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రింట్ మిషనరీ అందింది. ఈ విషయంలో అక్కడి సంపాదకీయ బృందం కృషి అభినందనీయం.
సి.బి.ఐ వార్తా సేకరణలో  'న్యూస్ పేజీ' కొంత ముందుంది.
ఇళ్ళస్థలాల సాధనలో 'జర్నలిస్టుల ఇళ్లస్థలాల సాధన సమితి' బృందం సభ్యుల ప్రణాళిక ఆదర్శనీయం.

అందని తీరాలకు చేరిన అందాల తార
రెండుతరాల హిరోలతో అందానికి నిర్వచనంగా మారిన అతిలోసుందరి శ్రీదేవి దుబాయ్ లో ఆమె కన్నుమూశారు.

నాడు దొంగలు - నేడు దొరలు
పురాతన కాలంలో కిలాడీలు, కేటుగాళ్ళు, దొంగలు‌, టక్కరి దొంగలు, గజ దొంగలు, ఘరానా దొంగలు, బందిపోట్లు... గ్రామాలపై బడి ఊరి సంపద దోచుకుని.. పరారయ్యేవారు.

ఇప్పుడు సాంకేతికంగా అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కార్పోరేట్ పేరుతో బ్యాంకుల మీద పడి దోచుకోవడంతో దొంగలు దొరలు అయ్యారు.
మిలియనీర్లు, మల్టీ మిలియనీర్లు, బిలియనీర్లు, మల్టీ బిలియనీర్లు అవుతున్నారు.

"బ్యాంకులలో ఫారాలు నింపేందుకు ఉంచే 2 రూపాయల విలువ చేసే పెన్నును దారంతో గట్టిగా బిగిస్తారు. మరి ఇంతలా జాగ్రత్తపడే బ్యాంకులు.. వేల కోట్ల రూపాయల విషయంలో ఎందుకు మోసపోతున్నాయి.

పేపరుకు అందని వార్తలు:

(1) సమయ సేవకు సెలవు
అమలాపురం గడియార స్తంభం కూల్చివేత

కోనసీమ వ్యాప్తంగా నిత్యం వచ్చే సందర్శకుల ప్రయోనార్థం 1957లో అప్పటి జిల్లా కలెక్టరు ఎ.కృష్ణస్వామి గడియార స్థభ నిర్మాణానికి శంకుస్థాపన జరగింది. మూడు సంవత్సరాల అనంతరం 1959లో ఆగస్టు 25న అప్పటి మున్సిపల్‌ ఛైర్మన్‌ కొల్లూరి చినవెంకటరత్నం (మైనర్‌) ఆధ్వర్యంలో ఆనాటి స్థానిక సంస్థల పరిపాలనాశాఖ మంత్రి డి.సంజీవయ్యతో ప్రారంభోత్సవం జరుపుకుంది. 

పునాది నుంచి చుతురస్రాకారంలో నిర్మితమైన ఈ స్తంభం పైకి వెళ్ళే కొద్దీ పరిమాణం తగ్గేలా సుమారు 40 అడుగుల ఎత్తులో డిజైన్‌ చేశారు. పైన నాలుగు వైపులా నాలుగు పెద్ద పరిమాణంలో ఏర్పాటుచేసిన గడియారాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపించేవి.
60 ఏళ్ళ ఆకర్షణీయమైన కట్టడం కూల్చివేతపై ఏ నాయకులు నోరువిప్పక పోవడం గమనార్హం.

(2) సూక్ష్మ స్థాయిలో ఉన్న క్షయ వ్యాధిని ఇట్టే పసిగట్టే 
సీˆబీనాట్ అనే యంత్రం తెలంగాణ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా, ములుగు ఆసుపత్రికి వచ్చింది.

ఎన్ని మందులు వాడినా తగ్గని క్షయ వ్యాధిని గుర్తించి దాని నివారణకు ఎలాంటి మందులు వాడాలనేది కూడా ఈ యంత్రం సూచిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్‌ కమల్‌ చందు స్పష్టం చేశారు.

(3) వైద్యకళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంసీఐ బృందం.
నెల రోజుల ముందు రావడంతో ఉరుకులు పరుగులు తీసిన వైద్యు కళాశాలల యాజమాన్యాలు.

ఆకర్షణీయమైన శీర్శికలు:

‘మొక్క’ హతం.. ఏదీ.. హరిత హితం

డబ్బుకు వైద్యం దాసోహం

వేసవిలో వెక్కిళ్లే!
కాలువల్లో అడుగంటుతున్న నీరు 

భూమి ఒకరిది..పేరు మరొకరిది!
అనుభవదార్ల పేర్లు మారి ఇక్కట్లు 

బుల్లి బజారు.. జాప్యంతో బేజారు!
స్థలాల ఎంపికతో సరి 
పురోగతిలేని కార్యాచరణ 

లంకల్ని మింగుతున్న రావణులు
నిబంధనలకు విరుద్ధంగా గోదావరి నదీగర్భంలో ఆక్వా సాగు

ఎందుకడిగారబ్బా..?
అక్రమ నిర్భంధం... వీడియో సి.డి ఇవ్వండి.. హైకోర్టు
సహజంగా హైకోర్టు వీడియోలు నేరుగా స్వీకరించదు. ఎవరైనా జత పరిస్తే నిరాకరించదు. అయితే ఓ కేసులో
పరిశోధన జర్నలిస్ట్ ను 2013, ఆగస్టు 15వ తేదీన అక్రమంగా నిర్భంధించిన కేసులో కీలకంగా మారిన వీడియోను సమర్పించాలని, కుటుంబానికి చెందిన స్వంత వాహనంలో తరలించిన టోలుగేటు రశీదులు కూడా వెంటనే సమర్పించాలని చెప్పింది.
ఈకేసులో హైకోర్టు రిజిస్ట్రార్ విజిలెన్స్ ఆదేశాల మేరకు జిల్లా న్యాయస్థానం విచారణ పూర్తి చేసింది.
                                            --విశ్లేషణ: అనంచిన్ని వెంకటేశ్వరరావు,9440000009

Related Posts