యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థూల ఆస్తుల విలువ రూ.339.89 కోట్లు. ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు కాకుండా ఈ మొత్తం ఆస్తులు జగన్ పేరిట ఉన్నాయి. నామినేషన్ దాఖలు చేసిన సందర్బంగా జగన్.. నామినేషన్‌తోపాటు తన, తన కుటుంబసభ్యుల ఆస్తుల వివరాలతో కూడిన 47 పేజీల సుదీర్ఘ అఫిడవిట్‌ను సమర్పించారు. అఫిడవిట్‌లోని మరికొన్ని వివరాలు..
చేతిలో ఉన్న నగదు..
జగన్: రూ.43,560
భార్య భారతి: రూ.49,390
బ్యాంకుల్లో డిపాజిట్లు.. పెట్టుబడులు
జగన్‌కు: బెంగళూరులోని ఓరియంటల్ బ్యాంకుఆఫ్ కామర్స్‌లో రూ.20,20,083, అక్కడే మరో ఖాతాలో రూ.1,25,32,855, హైదరాబాద్ సచివాలయం ఎస్‌బీఐలో రూ.21,44,746, మల్కాజిగిరి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో రూ.25వేలు ఉన్నాయి.
* భారతికి బెంగళూరు బసవేశ్వరనగర్‌లోని యాక్సిస్ బ్యాంకు ఖాతాలో రూ.9,69,686, అక్కడే మరో ఖాతాలో రూ.17,41,087 ఉన్నాయి. కోరమంగళలోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌లో రూ.5,73,701.. ఇక్కడే మరో ఖాతాలో రూ.20,90,821 ఉన్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓబీసీ బ్యాంకులో రూ.8.09,884, పులివెందుల ఎస్‌బీఐలో రూ.21,37,480 ఉన్నట్లు చూపించారు. యాక్సిస్ బ్యాంకు ట్రావెల్ కార్డు కింద రూ.1,09.500గా పేర్కొన్నారు.
పెట్టుబడులు
జగన్‌కు: భారతి సిమెంట్స్‌తో సహా 13 కంపెనీల్లో పెట్టుబడులు, ఈక్విటీ షేర్లు మొత్తం రూ.317,45,99,618గా ఉన్నట్లు చూపించారు.
భారతికి: వివిధ కంపెనీల్లో పెట్టుబడులు, షేర్లు రూ.62,35,01,849 ఉన్నట్లు చూపారు.
జగన్ పేరిట ఎలాంటి ఆభరణాలు లేవు.
భారతి పేరిట: రూ.3,57,16,658 విలువజేసే ఆభరణాలు. హర్షిణి: రూ.3,16,13,435 ఆభరణాలు. వర్షా: రూ.3,12,46,415 ఆభర ణాలు ఉన్నాయి.
వాహనాలు.: 2007లో బీఎండబ్ల్యూ ఎక్స్5, 2009లో మూడు స్కార్పియోలు రిజిస్ట్రేషన్ అయినట్లు చూపారు. ఈ నాలుగు వాహనాల కొనుగోలుకు తాను ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని, తన పేరుతో రిజిస్ట్రేషన్ మాత్రమే అయిందని వివరించారు.
స్థిరాస్తుల్లో..: స్థిరాస్తుల విషయంలో హైదరాబాద్ లోటస్‌పాండ్, బెంగళూరులోని ఇళ్లకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. ఇటీవలే గుంటూరు జిల్లా తాడేపల్లిలో గృహప్రవేశం చేసిన ఇంటికి సంబంధించిన వివరాలను మాత్రం అఫిడవిట్‌లో తెలిపారు. రూ.1,19,21,202 అప్పున్నట్లు కనబరిచారు. ఇందులో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ.5,80,584 అని చూపారు. ఇవేగాక వివాదంలో ఉన్న అప్పులు తన పేరిట రూ.66 కోట్లు, తన భార్య పేరిట రూ.6.75కోట్లు ఉన్నట్లు తెలిపారు.
* జగన్ పేరిట ఇడుపులపాయలో రూ.42.44లక్షల విలువ 42.44 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయేతర భూమి కింద పులివెందుల మండలం భాకరాపురంలో రెండు వేర్వేరు సర్వేనెంబర్లలో రూ.8,42,39,232 విలువ 4,51,282 చ.గజాల స్థలం చూపించారు. బంజారాహిల్స్ రోడ్‌నెం.2లో రూ.14,46,33,560 విలువ వాణిజ్య భవనం ఉండగా, సాగర్‌సొసైటీలో, పులివెందుల మండలంలోని భాకరాపురంలో రూ.11,99,59,582 విలువ నివాసిత భవనాలు రెండు ఉన్నాయి.
వైఎస్ భారతి పేరుతో
* కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో తొమ్మిదెకరాలు, ఉడిపి జిల్లాలో 37సెంట్లు.
* పులివెందుల మండలంలోనే మొత్తం 10చోట్ల రూ.7,17,41,262 విలువైన వ్యవసాయేతర భూమి.
* పులివెందుల, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని రాయదుర్గంలో రూ.10,25,45,015 విలువైన వాణిజ్య భవనాలున్నాయి. పులివెందులలో నివాసగృహంతోపాటు గుంటూరు జిల్లా తాడేపల్లిలో రూ.13,89,51,648 మార్కెట్ విలువజేసే రెండు విల్లాలు.
ఒప్పందాల్లో..
* 24 ప్రభుత్వరంగ సంస్థలతో భారతి సిమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు కుదుర్చుకుంది. తెలంగాణ ట్రాన్స్‌కోతో సరస్వతి వపర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంది.