యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏప్రిల్ 11వ తేదీన జరగబోవు మైలవరం అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉంటుందని తెలుగుదేశం పార్టీ జెండా మరోసారి విజయకేతనం గా ఎగురుతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రకటించారు. శనివారం నాడు పైడురుపాడు, రాయనపాడు గ్రామాలలో జరిగిన ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో లో ఆయన ఉత్సాహంగా ఉరకలు వేస్తూ పాల్గొన్నారు. వేలాదిగా గ్రామ ప్రజలు అడుగడుగున మంత్రి దేవినేని ఉమా కు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉమా మాట్లాడుతూ మైలవరంలో లో వారు వన్ సైడే అయినా కోడి కత్తి పార్టీ పట్ల కార్యకర్తలు నాయకులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. కొండదిగని కొంగర మల్లయ్య, ఆయన కొడుకు కొంగర పుల్లయ్యల వల్ల మైలవరం నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదని తేల్చి చెప్పారు. చేసిన అభివృద్ధిని చూడమని గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అండగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కృష్ణానదిపై పవిత్ర సంగమం దగ్గర నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తయిన కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జి, దాములూరు వద్ద నిర్మిస్తున్న దాములూరు - వైకుంఠపురం బ్యారేజీ, మెట్ట రైతుల సిరుల పంటగా భాసిల్లుతున్న చింతలపూడి ఎత్తిపోతల పథకంతో మైలవరం నియోజకవర్గ రూపురేఖలు అద్భుతంగాను, చారిత్రాత్మకంగాను మారబోతున్నట్లు చెప్పారు. కృష్ణా జలాల కోసం బాబ్లీ ప్రాజెక్టు వద్ద ధర్నా చేసిన సందర్భంగా అక్కడ పోలీసులు నాపై కేసు పెట్టారని, వైకాపా అభ్యర్థి 420 సిబిఐ ఈడీ కేసులో ముద్దాయిగా ఉన్నారని ప్రజలకు వివరించి చెప్పారు. ఇలాంటి 420 ముద్దాయిలు మైలవరం ప్రజలకు అవసరమా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతికి నష్టం కలిగిస్తే హైదరాబాద్ కు మేలు జరుగుతుందని అందుకే కేసీఆర్ ర్ జగన్మోహన్ రెడ్డికి వెయ్యికోట్లు రిటర్ గిఫ్ట్ గా ఇచ్చారని ఆరోపించారు. కెసిఆర్ ఎన్నికల ప్రచార వాహనాలను, గోడ గడియారాలను, కోడి కత్తి పార్టీ వాళ్ళు తెచ్చుకొని ప్రచారం చేస్తున్నట్లు విమర్శించారు. మైలవరం ప్రజల ఓటు బలం తో పట్టిసీమ కట్టామని, నాలుగేళ్లలోనే 44 వేల కోట్ల పంట కాపాడమని తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో 15 వేల ఇళ్లిచ్చామని, మరో 15 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చామని 100 ఎకరాలలో జక్కంపూడి హౌసింగ్ కాలనీ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. 186 కోట్లతో కృష్ణా జలాలను మైలవరం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి త్రాగునీటి గా అందించేందుకు ఇప్పటికే పనులను చేపట్టామని చెప్పారు. పనులు చేసి ఓట్లు అడగటమే నాకు తెలుసునని 24 గంటలు ప్రజలమధ్య ఉంటూ కష్టపడటం నాకు తెలిసిన రాజకీయమని మంత్రి ఉమా స్పష్టం చేశారు. ఉమా ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు మండుటెండను సైతం లెక్కచేయకుండా హారతులు పట్టారు. ఆయనతో పాటు సైకిల్ గుర్తుకే ఓటేయాలని నినదిస్తూ మంత్రి ఉమా వెంట నడిచారు.