YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంచు కుటుంబం ముంచే కుటుంభం మోహన్‌బాబుపై కుటుంబరావు తీవ్ర విమర్శలు

మంచు కుటుంబం ముంచే కుటుంభం          మోహన్‌బాబుపై కుటుంబరావు తీవ్ర విమర్శలు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
 

 మంచు కుటుంబం ముంచే కుటుంబమని తేలిపోయిందని రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. మోహన్‌బాబు సెలబ్రిటీ ముసుగు వేసుకున్న దొంగ అని ఆరోపించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోహన్‌బాబుకు కావాల్సింది ధనికులతో పరిచయాలేనని మండిపడ్డారు. మంచు విష్ణు పులివెందుల అల్లుడేనని, ఆయన పులివెందుల అల్లుడయ్యాకే ఆ కుటుంబం మారినట్టు కనిపిస్తోందని చెప్పారు. మంచు మనోజ్‌ ప్రభుత్వానికి రాసిన లేఖలో ఎంత బకాయిలు ఉన్నయో రాయలేదని చెప్పారు. మోహన్‌బాబు కుటుంబం విద్యను వ్యాపారంగా చూస్తోందని మండిపడ్డారు. రాయలసీమలో రెడ్డిని కూడా కాపు అని రికార్డుల్లో రాయడం ఆనవాయితీ అని చెప్పారు. దీంతో సాంకేతికంగా ఆ విద్యార్థులు ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు అనర్హులయ్యారని వివరించారు. మోహన్‌బాబు విద్యా సంస్థలకు ఇవ్వాల్సిన రూ.6 కోట్లలో రూ.5 కోట్లు ఈ కోవకు చెందినవేనని చెప్పారు. ఉచిత విద్య సాకుతో విరాళాలు తీసుకుంటున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. క్రిమినల్‌ చెవిరెడ్డిని వెంట పెట్టుకొని మోహన్‌ బాబు చంద్రగిరి మొత్తం తిరుగుతున్నారని ఆరోపించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికీ సమాధానం లేదన్నారు. తమ విద్యా సంస్థలపై విచారణకు మోహన్‌బాబు సిద్ధమా అని ప్రశ్నించారు.

Related Posts