యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
2019 సంవత్సరానికిగాను టీఎస్ సెట్ నోటిఫికేషన్ ను ఉస్మానియా విశ్వ విద్యాలయం విడుదల చేసింది. టీఎస్ సెట్ లో భాగంగా మొత్తం 29 సబ్జెక్టులకు, జూలై 5, 6వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీ యాదవరాజు వెల్లడించారు. తొలిసారిగా ఈ పరీక్షలను ఆన్ లైన్ లో నిర్వహించనున్నామని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు రాయాలని భావించే అభ్యర్థులు ఈ నెల 27 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని తెలియజేశారు. పరీక్షలకు సంబంధించిన వివరాలు, దరఖాస్తు విధానాన్ని 'www.telanganaset.org', 'www.osmania.ac.in' వెబ్ సైట్లలో చూసి తెలుసుకోవచ్చని అన్నారు.