యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సత్తెనపల్లి నియోజకవర్గంలో గత ఐదేళ్లలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఏపీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తెలిపారు. నియోజకవర్గం ప్రజలు మరోసారి అవకాశం ఇస్తే, ఈసారి మరింత అభివృద్ధి చేపడతామన్నారు. సత్తెనపల్లిలో ఈరోజు తారకరామ సాగర్ వాకింగ్ ట్రాక్ దగ్గర కోడెల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఓటర్లతో ముచ్చటించారు. నాకు ఓటేయండి మీ కోసం పనిచేస్తా అని చెప్పడం లేదు. మీకోసం పనిచేశాను. కాబట్టి ఓటేయండి అని అడుగుతున్నా’ అని వ్యాఖ్యానించారు.