రాబోయే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాల్లో టీడీపీనే ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో వైసీపీ ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఈరోజు ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం తథ్యమన్నారు.