YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా

సిరిమల్లెపూవు వసివాడింది..

Highlights

  • దుబాయ్‌ ఓ పెళ్లి ఫంక్షన్‌ లో కుప్పకూలిన 
  •  శ్రీదేవి ఒక నటనాతరంగం .
  • అగ్రహీరోలందరి జోడీగా అతిలోకసుందరి
సిరిమల్లెపూవు వసివాడింది..

సిరిమల్లెపూవు వసివాడింది.. అర్ధశతాబ్దంపాటు భారత సినీతోటలో సుగంధాలను విరబూసిన నటనాకుసుమం.. శ్రీదేవి. మూడో ఏటనుంచే వెండితెరపై వెలిగిన వెలుగుల నక్షత్రం.. చుక్కల లోకానికి వెళ్లిపోవడం అభిమానులను గుండెలను పిండివేస్తోంది.


దుబాయ్‌లోని ఓ పెళ్లి ఫంక్షన్‌కు హాజరైన ఆమె రాత్రి రెడున్నర గంటల సమయంలో హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. హార్ట్‌ఎటాక్‌ సీవియర్‌గా రావడంతో ఆమె అక్కడి కక్కడే కుప్పకూలిపోయారు. కొద్ది నిముషాల్లోనే ఆమె  కన్నుమూశారు. శ్రీదేవి మృతి చెందిన సమయంలో  భర్త బోనీకపూర్‌, చిన్నకూతురు ఖుషీ ఆమెవద్దే ఉన్నారు. శ్రీదేవి మరణ వార్తతో యావత్‌ భారత సినీపరిశ్రమతోపాటు కోట్లాది మంది అభిమానుల గుండెలు బరువెక్కాయి. దివిసీమలకేగిన జాబిలమ్మ.. నిత్యం అభిమానుల మనసుల్లో వెలుగుతూనే ఉంటుంది..కోట్లాది మంది గుండెల్లో కొండత బాధను మిగిల్చి దివిసీమలకు పయనమయింది. సిరిమల్లెపూవు వసివాడింది.. అర్ధశతాబ్దంపాటు భారత సినీతోటలో సుగంధాలను విరబూసిన నటనాకుసుమం.. శ్రీదేవి. మూడో ఏటనుంచే వెండితెరపై వెలిగిన వెలుగుల నక్షత్రం.. చుక్కల లోకానికి వెళ్లిపోవడం అభిమానులను గుండెలను పిండివేస్తోంది.


   శ్రీదేవి ఒక నటనాతరంగం .. అభిమానుల గుండెల్లో వెల్లువగోదావరిలా ఉప్పొంగింది. 1964ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించింది శ్రీదేవి. తండ్రిపేరు అయ్యప్పన్‌, తల్లి రాజేశ్వరి. తన నాలుగోఏటనే నటన ప్రారంభించిన శ్రీదేవి.. కన్దన్‌కరుణాయ్‌ అనే తమిళ సినమాలో నటించింది. 1975 -నుంచి 1985వరు తమిళ సినీపరిశ్రమలో శ్రీదేవి అగ్రకథానాయికగా కొనసాగారు. శ్రీదేవికి 1996లో బోనీకపూర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు జాన్వీ, ఖుషీ ఉన్నారు. తెలుగు,తమిళ, హిందీ మళయాళం, కన్నడతోపాటు పలు భారతీయ భాషల్లో నటించి శ్రీదేవి సాటిలేని నటిగా పేరుపొందారు. 2013లో పద్మశ్రీ అవార్డు,  15 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 
తెలుగు సినీపరిశ్రమలో శ్రీదేవి అందరు అగ్రహీరోలతో జోడీగా నటించారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ, శోభన్‌బాబు,చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జునతో పలు చిత్రాల్లో నటించిన శ్రీదేవి తెలుగుతెరపై వెన్నెలమ్మ, వెల్లువగోదావరిలా నిలిచిపోయింది. పదహారెళ్లవయసు చిత్రంలో శ్రీదేవిని చూసి గుండెజారని కుర్రకారు అప్పట్లో లేదంటే అతిశేయొక్తికాదు. అంతలా తన అందం, అంతకు మించిన సహజ, చిలిపినటతో కోట్లాదిమంది అభిమానుల మనసుల్లోనిలిచిపోయింది ఈ జాబిలమ్మ. 1978లోనే హిందీ చిత్ర పరిశ్రమలో అడుగిడిన శ్రీదేవి సోలాసావన్‌ మూవీలో నటించింది. ఆమె జితేంద్రతో నటించిన హమ్మత్‌వాలా  సినిమాద్వారా హిందీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. 1980ల్లో ఆమో హిందీ యవనికపై ఓ వెలుగు వెలిగారు. నగీన, మిస్టర్‌ఇండియా, చాందినీ, చాల్‌బాజ్‌చిత్రాలద్వారా ప్రేక్షకుగల గుండెల్లో జాబిల్లిలా నిలిచింది శ్రీదేవి.  శ్రీదేవి మృతికి రాష్ట్రపతి రామనాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. శ్రీదేవి మృతి తమను షాక్‌కు గురిచేసిందని పలువురు సినీ ప్రముఖులు ట్విట్టర్‌ లో సంతాపం ప్రకటిస్తున్నారు.

Related Posts