YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాహల్‌పై.. స్మృతీ ఇరానీ రెండోసారి పోటి

రాహల్‌పై.. స్మృతీ ఇరానీ రెండోసారి పోటి

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌పై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాందీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అమేఠీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఏదో ఒక స్థానం నుంచి పోటీచేస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రాహుల్‌పై ఆమె విమర్శలు గుప్పించారు. ఇక్కడి ప్రజలు రాహుల్‌ను తిరస్కరించారని.. నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏమీ చేయలేదని స్మృతి ఆరోపించారు. అందుకే మరో సురక్షితమైన స్థానం నుంచి పోటీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. అమేఠీ నుంచి పోటీ చేస్తున్న రాహల్‌పై.. స్మృతీ ఇరానీ రెండోసారి బరిలో ఉన్నారు. 2014లో స్మృతీ ఇరానీపై రాహుల్ గాంధీ లక్షకు పైగా మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. స్మృతి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌సింగ్‌ సూర్జేవాలా తీవ్రంగా స్పందించారు. గతంలో చాంద్‌నీచౌక్‌, అమేఠీలో కాంగ్రెస్‌ ఆమెను ఓడించిందని గుర్తుచేశారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ రాజ్యసభ ద్వారా పరోక్షంగా పార్లమెంటులోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఇక దక్షిణాది నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయాలంటూ పలువురు కాంగ్రెస్ నేతలు కోరుతున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్‌ మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. కాగా, వాయనాడు నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తారని కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముళ్లపల్లి రాంచంద్రన్ శనివారం తెలిపారు. దీనిపై పార్టీ వర్గాల నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు.

Related Posts