YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మోహన్‌బాబుకు లేదు

చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత  మోహన్‌బాబుకు లేదు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విద్యాసంస్థలు నడుపుతున్న కొంతమంది సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని తెదేపా అధికార ప్రతినిధి సాధినేని యామిని హితవు పలికారు. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు.  చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత సినీనటుడు మోహన్‌బాబుకు లేదన్నారు. మంచు ఫ్యామిలీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. సినిమాల్లో కొట్టే డైలాగులు ఆపాలని.. ఎవరూ వినేవారు లేరన్నారు. సీఎం గురించి మాట్లాడే ముందు తమ స్థాయేంటో తెలుసుకోవాలన్నారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు వంటి సమర్థ నాయకత్వం అవసరమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్‌కు స్పష్టమైన ప్రణాళికలు, విజన్‌ లేదని విమర్శించారు. 

Related Posts