పెళ్లి వార్తలను ఖండించిన అనుష్క
ప్రభాస్ నాకు మంచి మిత్రుడు మాత్రమే
సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకుంటా
హీరో ప్రభాస్, నటి అనుష్కలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ వార్తలను అనుష్క ఖండించింది. ప్రభాస్ తనకు మంచి మిత్రుడు మాత్రమేనని, అంతకు తమ ఇద్దరి మధ్య మరేమీ లేదని ఆమె తెలిపింది. తన పెళ్లి గురించి వదంతులను వ్యాపింపజేస్తున్నారని... సరైన వ్యక్తి తారసపడినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది.
స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై కూడా తనను ప్రశ్నలు అడుగుతున్నారని... అది వారి వ్యక్తిగత నిర్ణయమని, తాను మాట్లాడనని అనుష్క తెలిపింది. ప్రస్తుతం తన దృష్టంతా నటనపైనే అని స్పష్టం చేసింది. అశోక్ దర్శకత్వం వహించిన అనుష్క తాజా చిత్రం 'భాగమతి' విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. చెన్నైలో ఈ చిత్ర పరిచయ కార్యక్రమం జరిగిన సందర్భంగా అనుష్క మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, పై విధంగా స్పందించింది.