యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీకి పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. బూత్ స్థాయి కార్యకర్తలు సీరియస్‌గా పని చేస్తూంటారు. నంద్యాల ఎన్నికల సమయంలో.. బ్యాక్ ఆఫీస్ చేసిన వర్క్… ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించింది. టీడీపీ మైనస్‌లు తెలుసుకోవడంలో.. ఎక్కడిక్కడ ఉపయోగపడింది. అసంతృప్తిగా ఉన్న లీడర్లను గుర్తించడంలో… కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఆ బ్యాక్ ఆఫీస్ వర్క్.. టీడీపీలో ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఏ చిన్న అంశాన్ని వదిలి పెట్టకుండా… మైనస్‌లు ప్లస్‌లు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు గొప్ప వక్త కాదు. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పరు. గంటల తరబడి ప్రసంగిస్తారు. ఇవి.. ఆయనపై ఉన్న కామెంట్లు. ఎన్నికల ప్రచారంలో అవి రావడం లేదు. ఎదుకంటే.. చంద్రబాబు ప్రసంగాన్ని ఎక్కడైనా అర్థగంట కన్నా ఎక్కువ సేపు కొనసాగించడం లేదు. చెప్పాలనుకున్నది .. సూటిగా చెప్పేస్తున్నారు. దీనికి కారణం.. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ మార్చుకోవడం అని అంటున్నారు. సభలు, ప్రసంగాలు, రోడ్ షోలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ప్రతీ రోజు పార్టీ నేతల్ని అడిగి చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఇతర విధాలుగా కొన్ని ప్రాంతాలలో తన సభలు తరువాత పరిస్థితిపై ఫీడ్ బ్యాక్ కూడా తెప్పించుకుంటున్నారు. దీంట్లో వచ్చిన అభిప్రాయాలను బట్టి మార్చుకుంటున్నారు. అందులో ఈ బ్యాక్ ఆఫీస్ ఇస్తున్న ఫీడ్ బ్యాక్ కీలకం. కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటున్నారు. పసుపు -కుంకుమ, పెన్షన్ల పెంపు, అన్నదాత సుఖీభవ పధకంతో మహిళలు, పెన్షనర్లు, రైతుల్లో పాజిటివ్ ఓటు ఉందని, అదే గెలిపిస్తుందనే ధీమాలో ఉన్నారని.. వారిని అప్రమత్తం చేయాలని పార్టీ బ్యాక్ ఆఫీస్ సూచించింది. ఆ అభ్యర్ధులతో చంద్రబాబు వెంటనే మాట్లాడారు. జాగ్రత్తగా ఉండాలని, లోపాలు సవరించుకోవాలని సూచించడంతో పాటు అక్కడ ఉన్న సేవామిత్రాలు, బూత్ కమిటీ కన్వీనర్లును కూడా అప్రమత్తం చేయాలని పార్టీ కాల్ సెంటర్ ను ఆదేశించారు. నియోజకవర్గాల నుంచి ప్రచార సరళి నేతల కదలికలు, ద్వితీయశ్రేణి నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుని.. కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కసరత్తు.. కచ్చితంగా టీడీపీ ఓటింగ్ శాతాన్ని పెంచుతుందున్న అంచనాలున్నాయి.